Begin typing your search above and press return to search.
పూరి అందుకే నాకు ఛాన్సివ్వట్లేదు
By: Tupaki Desk | 31 July 2017 12:27 PM GMTతెలుగులో హీరోలకు - డైరెక్టర్లు మాత్రమే కాదు కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు కూడా మంచి క్రేజ్ ఉంటుంది. మన తెలుగులో ఒకరకంగా చాలా సినిమాలు వాళ్ళ వలన కూడా ఫేమస్ అయిన సంధార్భాలు ఉన్నాయి. అయితే సినిమాలలో మగ కారెక్టర్ ఆర్టిస్టులతో పోల్చి చూస్తే ఆడవాళ్ళకి కొంచెం గిరాకీ తక్కువనే చెప్పాలి. అలాంటి మన తెలుగు సినిమాలో కూడా తన మాటలతో కామిడీ టైమింగుతో జనాదరణ పొంది మంచి పేరు తెచ్చుకుంది నటి హేమ. ఈమె ఒక నటిగానే కాదు కొన్ని వివాదాలు వలన కూడా మంచి ఫేమస్ అయ్యింది. సినిమా అవకాశాలు కొంచెం తగ్గటంతో రాజకీయాల వైపు కూడా అడుగులు వేసింది.
ఇకపోతే ఇప్పుడు ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయనేది వాస్తవం. దాని గురించి మాట్లాడుతూ.. మీకు పూరీ జగన్నాథ్ బాగా దగ్గర వాడు కదా మీ ఫ్యామిలిలో ఒక సభ్యుడు లాంటి వాడు మరి అయన కూడా మీకు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అని అడిగితే.. “నాకు వాడు అన్నయ్య లాంటి వాడు. నాకు ఇవ్వకపోవడానికి కారణాలు అంటూ ఏమి లేవు వాడికి నేను ఇంకా అక్కా - వదినా పాత్రలు చేయాలనే వాడి కోరిక. నేను అమ్మగా చేస్తే వాడు చూడలేడు. అందుకే వాడి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. నేను బాగ బిజీ గా ఉన్నప్పుడూ కూడా వాడు నాకు అవకాశాలు ఇవ్వలేదు'' అని చెప్పింది
సినిమా ఆడవాళ్ళు పై చాల విమర్శలు వస్తున్నాయి దాని పై అభిప్రాయం ఏంటి అనే ప్రశ్నకు “ఏవండీ మీకు సినిమా వాళ్ళు ఒక్కరే కనిపిస్తారా మిగతా రంగాలలో లేదా?'' అని తిరిగి ప్రశ్న వేసింది. ''ఒకప్పుడు మీరు అనుకునే అ సంబంధాలు, చెడు అలవాట్లు ఉండేవి కానీ ఇప్పుడు అంతా చదువుకున్న డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వస్తున్నారు. అయినా ఇప్పుడు వాళ్ళు ఇష్టపడే సంబంధాలు పెట్టుకుంటున్నారు అనుకోండి.. దాని వలన వచ్చిన సమస్య ఏంటండి??'' అని ప్రశ్నించింది. ''అయినా ప్రపంచం అంతా సెక్స్ చుట్టూ డబ్బు చుట్టూనే కదా తిరుగుతాయి. మన జాతి బుద్దులే అంత'' అంటూ చురక వేసింది.
మీకు సినిమా ఆఫర్లు లేవు కాబట్టే రాజకీయాల్లోకి వస్తున్నారు అని అంటున్నారు అని అడిగితే “ నాకు జనాలకు సేవ చేయాలి అనిపిస్తుంది అందుకనే వస్తున్నా. నేను ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నాను. నా సినిమాలు నాకు ఎప్పుడూ ఉంటాయి. మీడియా దీన్ని వేరే కోణంలో చూపించి నాకు కుల గజ్జనో లేక ఫైర్ బ్రాండ్ అనో అని ప్రచారం చేస్తుంది. అది సరైన పద్దతి కాదు'' అని కోపం తెచ్చుకుంది హేమ. చివరిగా ఒక మాట ఎవరు నన్ను ఆంటీ అని పిలవకండి. నాకు ఇంకా వదిన, అక్క పాత్రలు చేసే వయసు ఉంది అని అంటుంది. నేను ఇప్పుడు అప్పుడే తల్లి పాత్రలు చేయదలుచుకోలేదు అని కూడా తేల్చేసింది.