Begin typing your search above and press return to search.
అబ్బే.. అంత లేదండీ అంటున్న హేమ!
By: Tupaki Desk | 2 Feb 2019 5:59 AM GMTక్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ టాలీవుడ్ లో చాలా పాపులర్. స్క్రీన్ మీద ఆవిడ ఎంత ఎనర్జిటిక్ గా ఉంటారో ఆఫ్ ది స్క్రీన్ కూడా అంతే ఎనర్జీ తో ఉంటారు. రీసెంట్ గా ఒక వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు. మిమ్మల్ని బయట 'గయ్యాళి' అని అనుకుంటున్నారు కదా అని అడిగితే అదేమీ లేదని.. ముక్కుసూటిగా ఉండడం వల్ల కొందరు అలా పొరపాటు అభిప్రాయం ఏర్పరచుకొని ఉండొచ్చని అన్నారు. ఏం మగవాళ్లేనా.. ఆడవాళ్లు కాన్ఫిడెంట్ గా ఉండకూడదా.. మాట్లాడకూడదా అని ప్రశ్నించారు.
మీకు 200 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. బీఎండబ్లు కార్లలో తిరుగుతారని బయట ప్రచారం ఉంది అని అడిగితే... అవన్నీ రూమర్లని నవ్వేశారు. సినిమా ఇండస్ట్రీలో కోట్ల రూపాయలేమీ సంపాదించలేదని.. కానీ తనకు ఇతర ఇన్ కమ్ సోర్సెస్ ఉన్నాయని వెల్లడించింది. తన పేరెంట్స్ బాగా ఉన్నవాళ్ళేనని.. అత్తమామలు కూడా డబ్బున్న కుటుంబమేనని తెలిపింది. కానీ తన నాన్నగారు మొదట్లో మేస్త్రిగా పని చేసి చాలా కష్టపడ్డారని తెలిపింది.
నటుడు శ్రీహరి మరణించిన సమయంలో ఏదో గొడవ అయిందట.. అని అడిగితే.. శ్రీహరి గారి ని కడచూపు చూసేందుకు అయన ఇంటి దగ్గరకు చాలామంది వచ్చారు. ఆ సమయంలో ఒకడు అసభ్యంగా తాకడంతో వాడికి నాలుగు తగిలించి.. పోలీసులకు అప్పజెప్పామని తెలిపారు. పోలిటిషియన్ హర్షకుమార్ కు మీ మధ్యలో ఏదో ఉందని రూమర్లు ఉన్నాయని అడిగితే.. అవన్నీ పనిలేని వాళ్ళు సృష్టించే వార్తలని.. హర్షకుమార్ గారు చాలా మర్యాదస్తులని... ఆయనకంటే కూడా ఆయన భార్య.. పిల్లలతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉందని తెలిపారు. వారు తమకు మొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని..ఇలాంటి పిచ్చిపిచ్చి వార్తలను పట్టించుకోనని అన్నారు.