Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: కులంపై జ‌గ‌ప‌తిబాబు వ్య‌తిరేక‌త‌

By:  Tupaki Desk   |   14 Feb 2023 9:04 PM GMT
ట్రెండీ టాక్‌: కులంపై జ‌గ‌ప‌తిబాబు వ్య‌తిరేక‌త‌
X
ప్ర‌ముఖ నిర్మాత కీ.శే వి.బి.రాజేంద్ర‌ప్ర‌సాద్ వార‌సుడు న‌టుడు జగపతి బాబు కుల‌రాజకీయాలకు అతీతంగా మాట్లాడ‌డం.. కుల పిచ్చిని వ్య‌తిరేకించ‌డం తాజాగా నెటిజ‌నుల్లో హాట్ టాపిక్ అయ్యింది. నిజానికి కులం వ్య‌వ‌హారంపై గ‌డిచిన పాతికేళ్లుగా ఆయ‌న అనుస‌రిస్తున్న పంథా ఎంద‌రికో మేలుకొలుపు.

మారుతున్న కాలానుగుణంగా మ‌నుషులు మారాలని కోరుకునే న‌టుడు జ‌గ‌ప‌తిబాబు అందుకు అతీతంగా త‌న సొంత కులం అయిన క‌మ్మ కుల పెద్ద‌ల వ్య‌వ‌హారికాన్ని ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇంత‌కుముందు త‌న కుమార్తె ఒక విదేశీయుడిని పెళ్లాడే క్ర‌మంలో త‌న‌ను కొంద‌రు ఎన్నారైలు బెదిరించార‌ని కూడా జ‌గ‌ప‌తిబాబు తెలిపారు. ఇప్పుడు మ‌రోసారి మీడియా చాట్ సెష‌న్ లో ఆయ‌న ఈ విష‌యాన్ని ప్ర‌స్థావించ‌డం హాట్ టాపిక్ అయ్యింది.

ఇలాంటి కుల పిచ్చికి తాను పూర్తి వ్యతిరేకిన‌ని జ‌గ‌ప‌తిబాబు అన్నారు. ఇంట్లో పనివాళ్లు వేరే కులస్థులు కావాలి. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి పడుకునేందుకు కులం అవ‌స‌రం లేదు. కానీ పెళ్లి అనేస‌రికి కులం చూడాలా? అని కూడా జ‌గ్గూ భాయ్ ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

బెజ‌వాడ సిద్ధార్థ్ కాలేజ్ ప్రిన్సిప‌ల్ త‌నను వేదిక‌పైనే కులం గురించి వ్య‌తిరేకంగా మాట్లాడ‌కూడ‌ద‌ని సెలవిచ్చిన విష‌యాన్ని గుర్తు చేసారు. వేదిక దిగువ‌న రెండు వేల మంది విద్యార్థులు క‌మ్మ కుల‌స్తులు కావ‌డంతో తనను వారించే ప్ర‌య‌త్నం చేసార‌ని కానీ తాను ఎక్క‌డా త‌గ్గ‌కుండా కులపిచ్చి త‌గ్గాల‌ని వ్యాఖ్యానించిన‌ట్టు జ‌గ‌ప‌తి గుర్తు చేసారు. కమ్మ కుల పిచ్చి ఉన్నవాళ్లని.. కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే పీస్ లు పీస్ లు చేసేస్తారని ప్రిన్సిపాల్ తనను బెదిరించినా ఎక్క‌డా తాను త‌గ్గ‌లేద‌ని కూడా అన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.