Begin typing your search above and press return to search.

ప్రముఖ 'విలన్'ను పెళ్లి చేసుకోబోతున్న సింగర్..!!

By:  Tupaki Desk   |   30 July 2020 2:30 AM GMT
ప్రముఖ విలన్ను పెళ్లి చేసుకోబోతున్న సింగర్..!!
X
ఇటు సౌత్.. అటు నార్త్ సినీ ఇండస్ట్రీలలో ప్రముఖ విలన్ పాత్రధారి అయిన పంజాబీ నటుడు కబీర్ సింగ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. తెలుగులో గోపీచంద్ హీరోగా నటించిన జిల్ సినిమాతో విలనుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత మెల్లగా స్టార్ హీరోల సినిమాలలో పవర్ ఫుల్ విలన్ పాత్రలు దక్కించుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. అయితే సుప్రీమ్ సినిమాలో కబీర్ పోషించిన విక్రమ్ సర్కార్ పాత్రతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తెలుగులో కబీర్ హీరోగా ఓ సినిమా కూడా ప్రారంభం అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇప్పుడిప్పుడే నటుడిగా పాపులర్ అవుతున్న కబీర్ సింగ్ త్వరలోనే తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

పాపులర్ పంజాబీ సింగర్ అయిన డాలీ సింధుతో కబీర్ సింగ్ వివాహం జరగనుంది. వీరిద్దరూ గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నారట. అంతేగాక గతేడాది ఇద్దరు కలిసి నిశ్చితార్ధం కూడా చేసుకున్నారట. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసుకుందాం అనుకున్న కబీర్ - సింధులకు కరోనా షాక్ ఇచ్చింది. కరోనా దెబ్బతో వారి పెళ్లి వాయిదా పడింది. అయితే ప‌రిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణయించుకున్నారట. కబీర్ తన పెళ్లి విష‌యాన్ని స్వ‌యంగా ఓ ఆంగ్ల మీడియాకు వెల్ల‌డించాడు. ఇద్దరు కూడా ఈ డిసెంబ‌ర్‌లో పెళ్లి ముహూర్తం పెట్టుకుంటామని తెలిపారు. కానీ డిసెంబర్ లో కూడా ప‌రిస్థితులు బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అంటున్నారు ఈ ప్రేమజంట. క‌రోనా ఉధృతి తగ్గకపోతే పెళ్లి వేడుక‌లు జ‌రుపుకోవ‌డం ఏమాత్రం ఇష్టం లేద‌న్నారు. అప్ప‌టివర‌కు అన్నీ అనుకూలిస్తే ముంబైలో పెళ్లి, ఢిల్లీలో రిసెప్ష‌న్ చేసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనా పెళ్లి ఘనంగా చేసుకోవాలని అంటున్నారు ఒక్కటి కాబోయే కబీర్-డాలీ కపుల్.