Begin typing your search above and press return to search.
#మీటూ:వెనకే వచ్చి ముద్దు పెట్టుకోబోయాడు
By: Tupaki Desk | 15 Oct 2018 5:58 AM GMTగత రెండు మూడు వారాలుగా బాలీవుడ్ లో లైంగిక ఆరోపణల కేసులు తెగ నమోదు అవుతున్నాయి. నానా పటేకర్ పై తనూశ్రీ దత్తా ఎప్పుడైతే లైంగిక ఆరోపణలు చేయడం, ఆమెకు బాలీవుడ్ తో పాటు దేశ వ్యాప్తంగా మహిళలు మద్దతుగా నిలిచారో అప్పుడే పలువురు హీరోయిన్స్ మీడియా ముందుకు వచ్చి తమకు ఎదురైన లైంగిక వేదింపులను గుర్చి చెబుతున్నారు. మరి కొందరు ఏకంగా పోలీసుల ముందుకు వెళ్లి తమపై లైంగిక దాడి చేసిన వారిపై ఫిర్యాదు ఇస్తున్నారు.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సుభాష్ ఘయ్ పై నటి కేట్ శర్మ లైంగిక ఆరోపణలు చేయడంతో పాటు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. గత ఆగస్టు 6వ తారీకున సుభాష్ ఘయ్ తనను ఇంటికి రమ్మని పిలిచాడు. సినిమా గురించి చర్చించాలని చెప్పడంతో నేను అక్కడకు వెళ్లాను. అప్పటికే అక్కడ మరికొంత మంది కూడా ఉన్నారు. నేను వెళ్లగానే కొద్ది సమయం మర్దన చేయాలని కోరాడు. షాక్ అయిన నేను పెద్దాయన అడిగాడు కదా అని మూడు నిమిషాలు మర్ధన చేశాను, ఆ తర్వాత చేతులు కడుక్కునేందుకు వాష్ రూం కు వెళ్లాను, నా వెనకే వచ్చి కౌగిలించుకని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు.
ఆయన ప్రవర్తనకు షాక్ అయ్యి దూరం జరిగాను, మాట్లాడాలి రూంలోకి రా అంటూ బలవంతంగా లాగే ప్రయత్నం చేశాడు, ఆ రోజు రాత్రి నన్ను అక్కడే ఉండాల్సిందిగా బలవంతం పెట్టాడు, ఒకవేళ ఉండకుంటే రాత్రి భోజనం చేయనంటూ బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కేట్ పేర్కొంది. కేట్ ఆరోపణలపై సుభాష్ ఘయ్ మామూలుగా స్పందించాడు. ఆమె ఆరోపణలను తన లాయర్ లు చూస్తుంటారు, ఆమె చేసిన ఆరోపణలు నిరూపించకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అన్నాడు. తాను మీటూ ఉద్యమానికి గొప్ప మద్దతుదారుడిని అంటూ సుభాష్ ఘయ్ పేర్కొన్నారు.