Begin typing your search above and press return to search.
బీ గ్రేడ్ ఫూల్స్ ను తీసుకొస్తున్నారు: కోట
By: Tupaki Desk | 11 March 2019 12:49 PM GMTతెలుగు సినిమాల్లో హీరోలు.. నిర్మాతలు మాత్రమే మెజారిటీ తెలుగువారు ఉంటారు. ఇక వీరు కాకుండా నటీ నటులు టెక్నిషియన్స్ లో ఇతర భాషల వారి హవా జోరుగా ఉంటుంది. గ్లోబలైజేషన్.. డిజిటలైజేషన్ జోరుగా ఉన్న ఈ కాలంలో ఇలాంటివేమీ తప్పు పట్టలేం కానీ.. ఇతర భాషల వారిని తీసుకునే నెపంతో తెలుగువారికి అవకాశాలు ఇవ్వకపోవడం కాస్త అలోచించాల్సిన విషయమే. ఈ ట్రెండ్ పై టాలీవుడ్ సీనియర్లు పలుమార్లు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఇక శ్రీరెడ్డి ఈ టాపిక్ పై చేసిన విమర్శలు అందరికీ గుర్తుండే ఉంటాయి.
ఈ విషయంపై గతంలో గట్టిగా స్పందించిన వారిలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా ఉన్నారు. తాజాగా మరోసారి ఈ టాపిక్ పై ఘాటు కామెంట్లు చేశారు కోట. మా కు ఎన్నికయిన కొత్త టీమ్ ఈ సమస్యపై దృష్టి సారిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇతరభాషల నటులు తెలుగులో నటించడానికి తాను వ్యతిరేకం కాదని.. తీసుకొస్తే నానా పటేకర్ లాంటి ప్రతిభావంతులైన నటులను తీసుకురావాలని అన్నారు. కానీ మన ఫిలిం మేకర్స్ ఇతర భాషలకు చెందిన బీ-గ్రేడ్ ఫూల్స్ ను తీసుకొచ్చి వారికి సహాయకులుగా తమ లాంటి సీనియర్లను నటించమని అడుగుతున్నారని మండిపడ్డాడు. అంతే కాదు.. అలాంటి పనికిరాని నటులకు లక్షల్లో.. కోట్లలో డబ్బు ముట్టజెప్తున్నారని.. ఇలాంటి ట్రెండ్ మారాలని అన్నారు. తెలుగువారు తెలుగు నటులకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని కోరారు.
కోట చెప్పేమాటల్లో ఎంతో వాస్తవం ఉంది కానీ ఆయన మాటలు వినేదెవ్వరు.. ఆ మాటలను ఆచరించడానికి ముందుకొచ్చేదెవ్వరు? హీరోలు.. నిర్మాతలు కూడా ఇతర భాషల నుండి ఇక్కడికి వచ్చి మన టాలీవుడ్ ను డామినేట్ చేస్తే కానీ మన జనాలకు నొప్పి తెలియదేమో. అప్పుడు తెలుగు.. తెలుగు అని లోకల్ రాగం.. నేటివ్ తాళం అందుకుంటారేమో!