Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ చేసిన తప్పును ఎత్తి చూపిన నటుడు
By: Tupaki Desk | 5 Dec 2020 3:30 AM GMTబాలీవుడ్ సూపర్ స్టార్.. బాద్ షా షారుఖ్ ఖాన్ చివరగా 'జీరో' సినిమాలో కనిపించాడు. ఆ సినిమాలో షారుఖ్ ఖాన్ మరగుజ్జు వ్యక్తిగా కనిపించాడు. అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. షారుఖ్ ఖాన్ పాతికేళ్ల సినీ కెరీర్ ను జీరో చేసింది అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. జీరో సినిమాను చేసిన కారణంగా షారుఖ్ ఎప్పుడు లేనంతగా ఏకంగా రెండున్నరేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవలే షారుఖ్ పఠాన్ సినిమాను మొదలు పెట్టాడు. అది వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
షారుఖ్ 'జీరో' సినిమా చేయడం పట్ల గతంలో పలువురు విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు లిల్లి పుట్ ఆ సినిమాపై స్పందించాడు. కాస్త సీరియస్ గానే లిల్లి పుట్ స్పందించాడు. జీరో సినిమాలో షారుఖ్ ఎందుకు నటించాడో అర్థం కాలేదు. మరగుజ్జు పాత్రలో నటించినంత మాత్రన జనాలు ఎందుకు చూస్తారు. అందులో షారుఖ్ కొత్తగా కనిపించలేదు. కాక పోతే పొట్టి వాడిగా మాత్రమే కనిపించాడు అని ప్రేక్షకులు భావించాడు. షారుఖ్ ను విభిన్నంగా చూడాలనుకున్న వారికి ఈ సినిమా కొత్తగా అనిపించలేదు. అందుకే సినిమా నిరాశ పర్చిందనే అభిప్రాయంను ఆయన వ్యక్తం చేశాడు.
సినిమాలో షారుఖ్ కంటే అనుష్క ఎక్కువగా కనిపించింది. ఆమె పాత్రను ప్రత్యేకంగా చూశారు. సినిమా చూస్తున్నప్పుడు పాత్రపై అయ్యో పాపం అనే జాలి కలుగలేదు. ప్రేక్షకులకు పాత్రపై జాలి కలిగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. కాని అతడి ప్రయత్నం విఫలం అయ్యింది. సినిమాలో పొట్టి వారు ఎదుర్కొనే సమస్యలను కూడా సరిగా చూపించడంలో మేకర్స్ విఫలం అయ్యారు అంటూ లిల్లి పుట్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.