Begin typing your search above and press return to search.
`నాటు నాటు నాటు` గురించి మ్యాడీ ఏమన్నారంటే?
By: Tupaki Desk | 4 Jan 2022 2:30 PM GMTఇండియాస్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం RRRలో `నాటు నాటు` పాట ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. ఇండియా వైడ్ అన్ని భాషల్లోనూ ఈ పాట ఓ ఊపు ఊపేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇద్దరు పోటీ పోటీగా డాన్సు చేసారు. సినిమాని ఈ ఒక్క పాట స్కైలో నిలబెట్టింది. తాజాగా ఈ పాట చూసిన కోలీవుడ్ హీరో మాధవన్ ప్రశంసలు కురిపించారు. చరణ్..ఎన్టీఆర్ డాన్సుకు మ్యాడీ సైతం ఫిదా అయిపోయారు. తన ట్విటర్ ఖాతాలో ఈ పాట లింక్ ని పోస్ట్ చేసి అభిమానాన్ని చాటుకున్నరు.
ఇద్దరి డాన్సు చూసి జెలస్ ఫీలవుతున్నాను. ఇద్దరు ఇలా కలిసి నటించడం చాలా గర్వంగా ఉంది. ముందు ఈ పాట చూసి షాక్ అయ్యాను. హ్యాట్సాఫ్ అంటూ తన మనసులో మాటని మ్యాడీ బయట పెట్టారు. ఈ పాట గురించి చాలా మంది ప్రముఖులు స్పందించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోలందరూ తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వివిధ భాషల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్థానిక నటులు ఇద్దర్ని ప్రశంసించారు. ఇక `ఆర్ ఆర్ ఆర్` సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కావాల్సి ఉండగా ఓ మిక్రాన్ వైరస్ కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
మళ్లీ ఏప్రిల్ లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కాబట్టి అభిమానులు అప్పటివరకూ వెయిట్ చేయకతప్పదు. `ఆర్ ఆర్ ఆర్` కి రాజమౌళి దర్శకత్వం వహించగా డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన సంగతి తెలిసిందే. కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇక మాధవన్ కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.