Begin typing your search above and press return to search.

ప్రూఫ్‌ తెచ్చుకోమంటున్న ఐటెం బాంబ్

By:  Tupaki Desk   |   14 July 2017 4:37 PM GMT
ప్రూఫ్‌ తెచ్చుకోమంటున్న ఐటెం బాంబ్
X
ఎంతమంది పేర్లయితే డ్రగ్స్ లో ఉన్నారంటూ వచ్చాయో.. వారి పేర్లను మేం చెప్పలేదని ఎక్సయిజ్ డైరక్టర్ అకున్ సబర్వాల్ చెప్పగా.. అసలు మాకు డ్రగ్స్ అనే పదం స్పెల్లింగ్ కూడా తెలియదని సదరు సెలబ్రిటీలు పేర్కొన్నారు. అందరూ క్లారిటీల మీద క్లారిటీలు ఇచ్చేసి.. దమ్ముంటే ప్రూవ్ చేయాలని వార్నింగులు కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఐటెం బాంబ్ ముమాయత్ ఖాన్ కూడా తన వంతుగా తన ఫీలింగ్స్ ను చెప్పేసింది.

దాదాపు దర్శకుడు పూరి జగన్ చుట్టూతా ఉండే గ్యాంగ్ అందరికీ డ్రగ్స్ విషయంలో నోటీసులు వచ్చినట్లు మన టివి ఛానళ్లలో కథనాలు వచ్చేశాయి. వారిలో సుబ్బరాజు అలాగే ఆర్ట్ డైరక్టర్ చిన్నా ముందుగానే స్పందించారు. ఇప్పుడు ఐటెం బాంబ్ ముమాయత్ ఏమంటోందటే.. ''మీ దగ్గర ప్రూఫ్‌ లేకుండా దయచేసి నన్ను బాధితురాలినో దోషినో చేయకండి. ఈ ఫేక్ న్యూస్ తో నన్ను ఏం చేయలేరు. నాతో కన్ఫామ్ చేసుకుని ఏ న్యూస్ అయినా వేసుకోండి కాని.. ఇలా పిచ్చిపిచ్చిగా రాయకండి వీడియోలు వేయకండి. హైదరాబాద్ సరదాగా రిలాక్స్ అవుదాం అని వస్తే ఇక్కడ నాకు భలే వెల్కమ్ చెప్పారులే ఈ న్యూస్ తో'' అంటోంది. అంతేకాదు.. ''నేను ఇప్పటివరకు వాటిని ఎప్పుడూ వాడలేదు. అసలు జీవితంలో ఎప్పుడూ వాడను కూడా'' అంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది అమ్మడు.

మరి సెలబ్రిటీలు ఇలా క్లారిటీలు ఇవ్వడం.. అటు ఎక్సయిజ్ శాఖ కూడా మేం మీడియాకు ఏ పేరు చెప్పలేదు అనడం.. మధ్యలో చూసే జనాలు వార్తలు వేసే మీడియాలూ బకరాలు అయిపోతున్నాయ్ అంతే.