Begin typing your search above and press return to search.
కత్తిపై రాముడి కత్తి దూసిన నాగబాబు
By: Tupaki Desk | 4 July 2018 8:23 AM GMTమనసుకు అనిపించింది చెబితే మీకు నొప్పి ఎందుకు? అంటు మాట్లాడే మేధావులు మన చుట్టూ చాలామందే ఉన్నారు. అలాంటోళ్లంతా కూడా.. తమకు మాదిరే కోట్లాది మందికి మనోభావాలు ఉంటాయని.. తమ మాటల ద్వారా వాటిని దెబ్బ తీస్తున్నామన్న కనీస ఆలోచన చేయరు. తమకు తోచినట్లుగా మాట్లాడే మేధావి ప్రముఖుల్లో కత్తి మహేశ్ ఒకరు.
ఇప్పటివరకూ పలు అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలు వర్గాల్ని ఇబ్బంది పెట్టగా.. తాజాగా శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీరాముడు.. సీతపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ఆయన మీద కేసు బుక్ కావటంతో పాటు.. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు కూడా.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాల్ని ఎదుర్కొంటున్న కత్తి మహేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేశారు. ఏ మాతాన్ని అయినా కించపరిచేలా ఎవరు మాట్లాడినా తప్పేనన్నారు. రామాయణం ఒక పుస్తకం కాదని.. హిందువులు ఆరాధించే చరిత్ర అని వ్యాఖ్యానించారు.
క్రైస్తవులకు బైబిల్.. ముస్లింలకు ఖురాన్ ఎలానో హిందువులకు రామాయణం అలాంటిదన్నారు. నాస్తికత్వం పేరుతో హిందువుల జోలికి వస్తే శిక్ష అనుభవిస్తారన్న మెగా బ్రదర్.. మత విశ్వాసాలు కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
హిందూమతంపైనా.. హిందూ దేవతలపైనా పథకం ప్రకారం దాడి జరుగుతుందన్న ఆయన మతపరమైన చర్యలను ఎవరూప్రోత్సహించొద్దన్నారు. హిందువుల మనోభావాల్ని కించపరిచేలా కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. లేదంటే చారిత్రక తప్పు చేసినట్లు అవుతుందన్నారు. మొత్తానికి కత్తి వ్యాఖ్యలపై ఏ సినీ ప్రముఖుడు మాట్లాడనంత ఘాటుగా నాగబాబు మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.