Begin typing your search above and press return to search.
గీతపై కామెంట్స్‌ను తట్టుకోలేక పోతున్న నందు!!
By: Tupaki Desk | 6 Sep 2018 1:43 PM GMTతెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొందరిపై నెగటివ్ కామెంట్స్ - కొందరిపై పాజిటివ్ కామెంట్స్ మరీ ఎక్కువ అయ్యాయి. సీజన్ ప్రారంభం నుండి కూడా కొందరు నెటిజన్ లు గీతా మాధురిని టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు చేస్తున్నారు. ఈమద్య అవి మరీ ఎక్కువ అయ్యాయి. కౌశల్‌ను సీజన్ మొత్తంకు నామినేట్ చేసినందుకు గాను గీతా మాధురిపై తీవ్ర స్థాయిలో నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. గీతా మాధురిపై వస్తున్న ట్రోల్స్ ను నందు తట్టుకోలేక స్పందించాడు.
బిగ్ బాస్ అనేది ఒక గేమ్ షో అని - దాన్ని గేమ్ లాగే చూడాలంటూ నందు కోరుతూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గీత మాధురి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న నెగటివ్ ప్రచారంతో ఆయన తీవ్ర మనస్థాపంకు గురైనట్లుగా ఆ వీడియోను చూస్తే అనిపిస్తుంది. బిగ్ బాస్ గేమ్ షోలో జరుగుతున్న పరిణామాలు అన్ని కూడా గేమ్ లో భాగమే అంటూ చెప్పుకొచ్చాడు. షో గురించి స్పందించడం తప్పులేదు, కాని ఒక మహిళను కించ పర్చే విధంగా మాట్లాడటం మాత్రం చాలా తప్పు అంటూ నందు వీడియోలో పేర్కొన్నాడు. గీత మాధురి గేమ్ గురించి కూడా స్పందించిన నందు కొద్ది నిమిషాలకే ఆ వీడియోను డిలీట్ చేయడం జరిగింది.
గీత మాధురికి మద్దతుగా నందు వీడియో పోస్ట్ చేయడంతో ఆమెపై మరింతగా నెగటివ్ ఫీలింగ్ కలిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయడంతో వెంటనే నందు ఆ వీడియోను డిలీట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే గీత మాధురి గురించి పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నందు వీడియో పెట్టడం వల్ల ఆ ట్రోల్స్ తగ్గక పోగా, మరిన్ని పెరుగుతాయని అందరి అభిప్రాయం. ఫైనల్ 5లో గీత మాధురి ఉండటం ఖాయం అంటూ మొదటి నుండి అంతా నమ్మకంను వ్యక్తం చేశారు. అన్నట్లుగానే గీత ఫైనల్ 5 కి మరో వారం దూరంలో ఉంది.