Begin typing your search above and press return to search.

'మేజర్' విజయంతో హ్యాపీగా ఉన్న నాని.. కారణమేంటంటే..?

By:  Tupaki Desk   |   8 Jun 2022 5:30 PM GMT
మేజర్ విజయంతో హ్యాపీగా ఉన్న నాని.. కారణమేంటంటే..?
X
వర్సటైల్ యాక్టర్ అడివి శేష్ నటించిన ''మేజర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసే దిశగా దూసుకుపోతోంది. 26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ పాన్ ఇండియా మూవీ తెరకెక్కింది. దీనికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు.

తెలుగు హిందీ మలయాళ భాషల్లో గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'మేజర్' సినిమాకు అన్ని ఏరియాల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులతో పాటుగా విమర్శకులు మరియు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకొని.. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది

'మేజర్' సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో నేచురల్ స్టార్ నాని ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ తో ప్రాఫిట్స్ అందుకున్న మహేష్ బాబు ఖుషీగా ఉండాలి కానీ.. నాని సంతోషంగా ఉండటమేంటి అని ఆలోచిస్తున్నారా?. దీనికి కారణం అడివి శేష్ హీరోగా నాని ''హిట్ 2'' అనే చిత్రాన్ని నిర్మించడమే.

శేష్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ''హిట్: ది సెకండ్ కేస్''. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. ప్రశాంత్ తిపిర్నేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్ వెంకటరత్నం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.

విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మించిన 'హిట్' మూవీ ఫ్రాంచైజీలో ''హిట్ 2'' సినిమా రూపొందింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'మేజర్' సినిమా హిట్ అవ్వడం 'హిట్ 2' సినిమాకు కలిసొస్తోంది.

'మేజర్' సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అవ్వడం.. అడివి శేష్ కి మరింత పేరు రావడంతో రాబోయే ''హిట్ 2'' చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇది సినిమాకు బజ్ తెచ్చిపెట్టడమే కాదు.. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోడానికి ఉపయోగపడుతుంది.

అంతేకాదు ఇప్పుడు 'హిట్ 2' సినిమాని ఇతర భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేసినా వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అలా చేయకపోయినా అడివి శేష్ మార్కెట్ పెరిగింది కనుక, ఆటోమేటిక్ గా నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా పెరుగుతాయి. ఎలా చూసుకున్నా 'మేజర్' సక్సెస్ శేష్ తదుపరి చిత్రాలకు హెల్ప్ అవుతుంది.

ఇది ప్రత్యక్షంగా నిర్మాత నాని కి లాభం చేకూరుస్తుంది కాబట్టి.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే 'మేజర్' కు మహేష్ బాబు బ్రాండ్ బాగా కలిసొచ్చింది. మరి ఇక్కడ నాని తన 'హిట్ 2' సినిమాని ఎలా ప్రమోట్ చేసుకుంటారో చూడాలి.

కాగా, ''హిట్ 2'' సినిమాలో హిట్ (హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్) ఆఫీసర్ కృష్ణ దేవ్ అలియాస్ కె.డి పాత్రలో శేష్ కనిపించనున్నారు. మొదటి కేసును తెలంగాణ ప్రాంతంలో జరిగినట్లు చూపించగా.. ఇప్పుడు రెండో కేసును ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో చూపించబోన్నారు.

ఇందులో మీనాక్షి చౌదరి - కోమలీ ప్రసాద్ - రావు రమేష్ - పోసాని కృష్ణ మురళి - భాను చందర్ - తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు. జాన్ స్టీవర్ట్ ఎడురి సంగీతం సమకూర్చారు. మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా.. గ్యారీ బీహెచ్ ఎడిటర్ గా వర్క్ చేశారు. 'గూఢచారి' 'ఎవరు' 'మేజర్' వంటి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న శేష్.. ''హిట్ 2'' తో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.