Begin typing your search above and press return to search.
నాగబాబు సీటు పై మనసుపడుతున్న అధ్యక్షుడు
By: Tupaki Desk | 27 Nov 2019 6:24 AM GMTఈటీవీ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు బయటకు వచ్చేసిన విషయం తెల్సిందే. దాదాపుగా ఏడు సంవత్సరాల పాటు మస్త్ ఎంటర్ టైన్ చేసిన జబర్దస్త్ క్యాక్రమం కు నాగబాబు ఒక పిల్లర్ గా నిలిచాడు. జబర్దస్త్ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకరు నాగబాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదో కారణం వల్ల నాగబాబు జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడు. దాంతో ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు మల్లెమాల వారు చాలా తర్జన భర్జనలు పడుతున్నట్లుగా తెలుస్తోంది.
రెండు మూడు వారాలు నాగబాబు లేకుంటేనే ఎవరిని తీసుకురావాలా అంటూ జుట్టు పీక్కున్న మల్లెమాల వారు ఇప్పుడు నాగబాబు పూర్తిగా తప్పుకోవడంతో ఆయన స్థానంను ఎవరితో భర్తీ చేయాలో అర్థం కాకుండా ఉందంటున్నారట. సాయి కుమార్.. బండ్ల గణేష్ నుండి మొదలుకుని చాలా మందితో మల్లెమాల వారు చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మా ప్రెసిడెంట్.. సీనియర్ నరేష్ జబర్దస్త్ జడ్జ్ సీట్ పై ఆసక్తిని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశాడు.
నరేష్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ తో మాట్లాడుతూ నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం. చాలా కాలంగా చూస్తూ ఉంటాను. జబర్దస్త్ కామెడీని ఎంజాయ్ చేస్తాను. అలాంటి కార్యక్రమంకు జడ్జ్ గా వ్యవహరించమని అవకాశం వస్తే తప్పకుండా ఆలోచిస్తాను అంటూ చిన్నగా తనకు జబర్దస్త్ జడ్జ్ స్థానం పై ఆసక్తి ఉందని చెప్పకనే చెప్పాడు.
నటుడిగా మరో వైపు మా పనులతో బిజీగా ఉన్నా కూడా జబర్దస్త్ ఛాన్స్ వస్తే తప్పకుండా అడ్జస్ట్ చేసుకుని చేస్తానంటూ చెప్పాడు. మొదట అవకాశం రానివ్వండి తప్పకుండా ఆలోచిస్తానంటూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పకనే నరేష్ చెబుతున్నాడు. మరి మల్లెమాల వారు ఈయన పేరును ఏమైనా పరిశీలనలోకి తీసుకుంటారేమో చూడాలి.