Begin typing your search above and press return to search.
ఛాంబర్ ను క్లీన్ చేసి కడగాల్సిన పరిస్థితి
By: Tupaki Desk | 8 April 2018 10:54 AM GMTశ్రీరెడ్డి నిరసన తీరుపై మా అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ఈ అసోసియేషన్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి శ్రీరెడ్డి నిరసనను తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన వారిలో సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ.. పారదర్శకతకు.. క్రమశిక్షణకు మా ప్రాధాన్యమిస్తుంది. ఏది జరిగినా బహిరంగంగా రికార్డు చేసి నూటికి నూరుశాతం పారదర్శకతను పాటిస్తామన్నారు.
దురదృష్టవశాత్తు అత్యవసరంగా ఎగ్జిక్యుటివ్ మీటింగ్ కు ఈ రోజు కాల్ ఫర్ చేశామని.. ఇలా చేయటం ఇదే తొలిసారని.. ఒక ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ కు కాల్ ఫర్ చేయటం అంటే చాలా పెద్దపని అని.. చాలా ఎనర్జీస్ ఇందుకోసం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ఇదంతా చేయకుండా అప్లికేషన్ ను సస్పెండ్ చేయొచ్చు. కానీ.. ఒక నిర్ణయం తీసుకునే ముందు కరెక్టా.. కాదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవటానికే సమావేశమయ్యాం. దీని ప్రకారం ఆ అమ్మాయి(శ్రీరెడ్డి) అప్లికేషన్ ను తిరస్కరిస్తున్నాం. అలా చేసే అధికారం మాకుంది.
ఆ అమ్మాయి ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన బైట్ లో ఒక మాట ఉంది. నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇంత వస్తుంటే నేనెందుకు చేయకూడదని. ఆమె ఎవరిని దూఫిస్తోంది? ఒక ఫోర్త్ ఎస్టేట్‌ను అవమానిస్తోంది.. మీడియా.. ఇండస్ట్రీ జాయింట్ ఫ్యామిలీ.. ఇది మనందరికి జరిగిన అవమానంగా నరేశ్ చెప్పారు.
ఫిలిం ఛాంబర్ ఆవరణలో చాలానే కార్యక్రమాలు జరిగాయని.. ఎన్నో సన్మానాలు నిర్వహించారని.. మరెన్నో చావులు చూశామని కానీ ఈ తరహా అర్థనగ్న ప్రదర్శనలు చూస్తానని తాను జీవితంలో అనుకోలేదన్నారు. నిజంగానే తన మనసు విరిగిపోయిందన్నారు. మొత్తం ఛాంబర్ ను క్లీన్ చేసి కడగాల్సిన అవసరాన్ని ఒక అమ్మాయి తీసుకొచ్చిందన్నారు.
భారతదేశ రాజ్యాంగాన్ని అబ్సినిటీ అనే ఒక నేరంతో ఆ అమ్మాయి నేరానికి పాల్పడిందన్నారు. నిరసన అనేది మన హక్కు అని.. కానీ ఎక్కడికి పోయింది మన భారతీయత? అని నరేశ్ ప్రశ్నించారు. ఒక అమ్మాయి అర్థనగ్నంగా నిరసన చేస్తుందంటే.. ఆ అమ్మాయి ఫస్ట్రేషన్లో ఉందా? సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? ఫ్రీ పబ్లిసిటీ.. ఇలాంటివెన్నో అంశాల్ని చూడాలి. తన నిరసనతో మా మాత్రమే కాదు మీడియానే కాదు.. హక్కుల కోసం పోరాడే ప్రతి సంఘం దీనికి నిరసన తెలపాలన్నారు.
శ్రీరెడ్డి నిరసన అందరికి జరిగిన అవమానంగా నరేశ్ చెప్పారు. ఇది తెలుగువారికి జరిగిన అవమానమని.. ఎవరూ కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దని.. తాము ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయమన్నారు. ఇలాంటి వాటిపై తాము చాలా సీరియస్ గా.. సివియర్ గా వ్యవహరిస్తామని హెచ్చరించారు.