Begin typing your search above and press return to search.

మా అధ్య‌క్షుడిగా న‌రేశ్‌.. వ‌చ్చిన మెజార్టీ ఎంతంటే?

By:  Tupaki Desk   |   11 March 2019 4:06 AM GMT
మా అధ్య‌క్షుడిగా న‌రేశ్‌.. వ‌చ్చిన మెజార్టీ ఎంతంటే?
X
పోటాపోటీగా సాగిన మా ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష స్థానాన్ని ప్ర‌ముఖ సినీ న‌టుడు న‌రేశ్ ఘ‌న విజ‌యం సాధించారు. మా ఎన్నిక‌ల చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని రీతిలో అత్య‌ధికంగా పోలింగ్ జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌రేశ్ ప్యాన‌ల్ ఘ‌న విజ‌యం సాధించింది. అధ్య‌క్షుడిగా న‌రేశ్‌.. జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా జీవిత రాజ‌శేఖ‌ర్.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజ‌శేఖ‌ర్ లు విజ‌యం సాధించారు.

మాలో మొత్తం 745 ఓట్లు ఉండ‌గా ఈసారి అత్య‌ధికంగా 472 మంది త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు. శివాజీ రాజాకు 199 ఓట్లు రాగా.. న‌రేశ్ కు ఏకంగా 268 ఓట్లు ల‌భించాయి. 69 ఓట్ల తేడాతో శివాజీరాజాను న‌రేశ్ ఓడించారు. ఈ ఎన్నిక‌ల్లో మా అధ్యక్షుడిగా న‌రేశ్ విజ‌యం సాధించిన‌ట్లు ఎన్నిక‌ల అధికారి ప్ర‌క‌టించారు.

ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఎన్నిక‌లు సాయంత్రం ముగిశాయి. ఓట్ల లెక్కింపు అర్థ‌రాత్రి వేళ ప్ర‌క‌టించారు. తొలి ఓటు న‌రేశ్ వేయ‌గా.. చివ‌రి ఓటు అల‌నాటి హాస్య న‌టుడు రాజ‌బాబు సోద‌రుడు చిట్టిబాబు వేశారు. మా ఎన్నిక‌ల నేప‌థ్యంలో సినీ ప్ర‌ముఖులంతా వ‌చ్చి ఓటు వేయ‌టంతో ఫిలింన‌గ‌ర్ ప్రాంతం సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌రేశ్‌.. శివాజీరాజా ప్యాన‌ళ్ల మ‌ధ్య హోరాహోరీ ప్ర‌చారంతో పాటు.. ఇరువ‌ర్గాలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఈవీఎంలు వినియోగించ‌గా.. ఈసారి ఎన్నిక‌ల్లో మాత్రం అందుకు భిన్నంగా బ్యాలెట్ ప‌త్రాల్ని ఉప‌యోగించారు.

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వారిని చూస్తే..

అధ్య‌క్షుడు: న‌రేశ్‌
జనరల్‌ సెక్రటరీ జీవిత రాజశేఖర్‌
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్ రాజశేఖర్‌
ఉపాధ్యక్షులు 1 ఎస్వీ కృష్ణారెడ్డి
ఉపాధ్యక్షులు 2 హేమ (ఇండిపెండెంట్)
కోశాధికారి రాజీవ్‌ కనకాల
జాయింట్‌ సెక్రటరీ గౌతమ్‌ రాజు.. శివబాలాజీ
ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు అలీ.. రవిప్రకాశ్‌.. తనికెళ్ల భరణి.. సాయికుమార్‌.. ఉత్తేజ్‌.. పృథ్వి.. జాకీ.. సురేశ్‌ కొండేటి.. అనితా చౌదరి.. అశోక్ కుమార్.., సమీర్‌.. ఏడిద శ్రీరామ్‌.. రాజా రవీంద్ర.. తనీష్‌.. జయలక్ష్మ.., కరాటి కల్యాణి,..వేణుమాధవ్‌.. పసునూరి శ్రీనివాస్‌