Begin typing your search above and press return to search.

గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి.. పెళ్లి కాదు!

By:  Tupaki Desk   |   23 Jan 2022 11:30 PM GMT
గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి.. పెళ్లి కాదు!
X
టాలీవుడ్ లో పెళ్లి కాని ప్ర‌సాద్ ల‌కు కొద‌వేమీ లేదు. ప్ర‌భాస్.. న‌వ‌దీప్.. త‌రుణ్ స‌హా ప‌లువురు ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నారు. ఇక వీళ్ల‌లో త‌రుణ్ పూర్తిగా వెండితెర‌కు దూర‌మ‌య్యాడు. ప్ర‌భాస్ ఎంతో బిజీ స్టార్ గా వెలుగుతుంటే.. అందుకు భిన్నంగా న‌వ‌దీప్ చాలా కాలంగా కెరీర్ ప‌రంగా సైలెంట్ అయ్యాడు.

అయితే సోష‌ల్ మీడియాల్లో అత‌డి డేర్ డెవిల్ అడ్వెంచ‌ర్ల సంగ‌తి అభిమానుల‌కు తెలుసు. టీవీ షోలు సినిమాలు చేసేప్పుడు కొన్ని అడ్వెంచ‌ర‌స్ లొకేష‌న్ల‌ను ప‌రిచ‌యం చేస్తుంటాడు. అయితే న‌వ‌దీప్ పెళ్లి చేసుకోడా? ఏజ్ బార్ అయిపోతున్న బ్యాచిల‌ర్ హీరోగానే మిగిలిపోతాడా? అంటూ సందేహం వ్య‌క్త‌మైంది.

సోష‌ల్ మీడియాలో ఒక అభిమాని న‌వ‌దీప్ పైనే పంచ్ వేశాడు. ``అన్నా గెడ్డం తెల్లబడుతోంది పెళ్లి చేసుకో ..`` అని అడిగాడో నెటిజ‌న్. ``గెడ్డం తెల్లబడితే ట్రిమ్ చేసుకోవాలి.. పెళ్లి కాదు!`` అంటూ సింపుల్ ఆన్స‌ర్ ఇచ్చాడు మ‌రి. ``దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం`` అంటూ కూడా సెటైర్ వేశాడు. మొత్తానికి న‌వ‌దీప్ స్ట్రాంగ్ కౌంట‌ర్ల ఉద్ధేశ‌మేంటో కానీ అత‌డికి ఇప్ప‌ట్లో పెళ్లి ఆలోచ‌న లేద‌ని ఖ‌రారైంది.

ఇంత‌కుముందు గెడ్డం చ‌క్ర‌వ‌ర్తి కూడా న‌వ‌దీప్ లానే ఆట‌ప‌ట్టించేవాడు. కానీ వ‌న్ ఫైన్ డే స‌డెన్ గా పెళ్లాడేసాడు. లేట్ ఏజ్ లో సైలెంటుగా పెళ్లాడాడు. దానికి గురువు ఆర్జీవీ రాలేదు. ఆ త‌ర్వాత సంగ‌తి తెలిసిందే. న‌వ‌దీప్ కూడా జేడీలానే అవుతాడేమో!