Begin typing your search above and press return to search.
యంగ్ హీరో నలుగురు పిల్లల ముచ్చట్లు
By: Tupaki Desk | 26 Oct 2021 5:30 PM GMTహీరో నిఖిల్ సిద్దార్థ్ ఎప్పుడు లేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే కార్తికేయ 2 మరియు 18 పేజెస్ సినిమా లు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు కూడా పట్టాలెక్కాయి. కెరీర్ ఆరంభించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సిద్దార్థ్ ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా సినిమాలు చేస్తూ వచ్చాడు. కాని ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. కరోనా వల్ల ఎప్పుడో విడుదల అవ్వాల్సిన సినిమాలు కార్తికేయ 2 మరియు 18 పేజెస్ ఆలస్యం అయ్యాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో వరుసగా కథలు విన్న నిఖిల్ పలు కథలకు ఓకే చెప్పాడు. అందులో రెండు కథలు పట్టాలెక్కించారు.
తాజాగా హీరో నిఖిల్ మాట్లాడుతూ తాను గతంలో ఎప్పుడు లేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాను. ఇంతకు ముందు ఒక్కో సినిమా చొప్పున చేశాను. కాని ఇప్పుడు మాత్రం నాలుగు సినిమాలు ఒకేసారి చేస్తున్నాను. ఈ నాలుగు సినిమాలు కూడా నాకు నలుగురు పిల్లల మాదిరిగా అన్నాడు. అన్ని సినిమాలు కూడా నాకు సమానం. ప్రతి సినిమా కోసం నా పిల్లలకు ఎంత ఎఫర్ట్ అయితే ఇస్తానో అంతగా ఇస్తాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి నిఖిల్ వరుసగా తాను చేస్తున్న సినిమాలపై చాలా నమ్మకంతో కనిపిస్తున్నాడు. ఈ నాలుగు సినిమాలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కనుక తప్పకుండా సక్సెస్ అవుతాయని ఆయన సన్నిహితులు అంటున్నారు.
కార్తికేయ సూపర్ హిట్ అయ్యింది కనుక సహజంగానే కార్తికేయ 2 పై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక సుకుమార్ రైటింగ్స్ తో పాటు గీతా ఆర్ట్స్ లో రూపొందుతున్న సినిమా కనుక 18 పేజెస్ కూడా అంచనాలను భారీగా మోస్తుంది. సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. పైగా ఈ సినిమాకు సుకుమార్ రచన సహకారం కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. కనుక సహజంగానే 18 పేజెస్ పై ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ఇప్పటికే విడుదల అయిన నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ కు సంబంధించిన పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా అంతే ప్రత్యేకతను సంతరించుకున్నాయి కనుక ఈ నాలుగు సినిమాలు కూడా నిఖిల్ కెరీర్ ను మరో లెవల్ కు తీసుకు వెళ్తాయో చూడాలి.