Begin typing your search above and press return to search.
కాబోయే భార్య సలహా పాటించిన యంగ్ హీరో!
By: Tupaki Desk | 29 March 2020 3:30 PM GMTకరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉండడంతో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు రతన్ టాటా లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ లు కరోనా బాధితులను ఆదుకునేందుకు.. సహాయక కార్యక్రమాలు చేపట్టేందుకు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా విరాళాలు ప్రకటిస్తూ తమ మంచితనం చాటుకుంటున్నారు. తాజాగా నిఖిల్ సిద్ధార్థ్ కూడా వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ అందించారు.
ప్రజలకోసం తమ ప్రాణాలను లెక్కచెయ్యకుండా వైద్యం చేస్తూ కరోనాపై పోరాడుతున్న డాక్టర్లను.. ఇతర వైద్య సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత అని అందుకే ఈ కిట్స్ అందించామని నిఖిల్ చెప్పాడు. 2000 రెస్పిరేటర్స్.. 2000 రీయూజబుల్ గ్లవ్స్.. 2000 ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్.. శానిటైజర్స్.. 10,000 ఫేస్ మాస్కులను తెలంగాణా.. ఏపీలోని హాస్పిటల్స్ లో పని చేస్తున్న డాక్టర్లకు ఇతర హెల్త్ వర్కర్లకు అందించామని చెప్పాడు నిఖిల్.
బాధితులకు విరాళం అందించడం.. ఫిలిం ఇండస్ట్రీ వర్కర్ల సహాయార్థం సాయం చెయ్యడం.. సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వడం దాదాపుగా అందరూ చేస్తుంటారు. అయితే నిఖిల్ ఇలా డాక్టర్లకు.. ఇతర వైద్య సిబ్బందికి ప్రొటెక్షన్ కిట్స్ అందజేయడానికి కారణం నిఖిల్ కు కాబోయే భార్య అని సమాచారం. వైరస్ కు ఎక్కువగా ఎక్స్ పోజ్ అయ్యేది వారేనని.. మన ప్రాణాలు కాపాడేందుకు వారు తమ ప్రానాలను లెక్క చెయ్యడం లేదని.. అలాంటి వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పడంతోనే నిఖిల్ తన విరాళం ఈ రూపంలో అందించాడని అంటున్నారు.