Begin typing your search above and press return to search.

నా వల్ల ఫ్యాన్స్ ఎంత చిరాకు.. బాధ పడుతున్నారో తెలుసు : ప్రభాస్‌

By:  Tupaki Desk   |   8 March 2022 3:30 PM GMT
నా వల్ల ఫ్యాన్స్ ఎంత చిరాకు.. బాధ పడుతున్నారో తెలుసు : ప్రభాస్‌
X
ప్రభాస్ మొహమాటస్తుడు.. సున్నిత మనస్కుడు.. చిన్న పిల్లాడి మనసు. ఇవి ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఆయనతో వర్క్ చేయడం ఆరంభించిన కొన్ని రోజుల వరకు కాస్త ఇబ్బంది. అలవాటు అయ్యి అతడు మాట్లాడటం మొదలు పెడితే వదిలి పెట్టడు. అతడి తో స్నేహం జీవితాంతం గుర్తుండి పోతుంది. అలాంటి స్నేహం ను ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రభాస్ యొక్క మంచి తనం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆయన సన్నిహితులకు ఎంతో దగ్గరగా అనిపించే ప్రభాస్ అభిమానులకు మాత్రం ఎప్పుడు దూరంగా ఉంటాడు అనే విమర్శలు ఉన్నాయి. ఆ విషయాన్ని స్వయంగా యాన కూడా ఒప్పుకున్నాడు. తన మనస్థత్వం కారణంగా అభిమానులు ఇబ్బంది పడుతున్నారు అంటూ తాజా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఇండస్ట్రీలో ఏ హీరో అయినా చాలా యాక్టివ్‌ గా అభిమానులకు చేరువగా ఉంటాడు. కాని ప్రభాస్ మాత్రం కాస్త మొహమాటం మరియు అంతర్ముఖుడు అవ్వడం వల్ల అభిమానులతో కలిసేందుకు ఇబ్బంది పడతాడు.

ఆ విషయాన్ని ప్రభాస్ ఒప్పుకుని తనకు తాను అభిమానులను ఇబ్బంది పెడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. నా అభిమానులకు నా వల్ల ఎంతో చిరాకు కలుగుతూ ఉంటుంది. నా వల్ల వారు పలు సందర్బాల్లో బాధ పడి ఉంటారు. నాకు తెలుసు. కాని నేను వారికి కావాల్సిన విధంగా ఉండలేక పోతున్నాను అంటూ ప్రభాస్ అన్నాడు. నేను ఎక్కువగా మాట్లాడక పోవడంతో వారు చిరాకు పడ్డ సందర్బాలు చాలా ఉన్నాయని సరదాగా వ్యాఖ్యలు చేశాడు.

నా స్నేహితులు మరియు సన్నిహితులు ఎప్పుడు కూడా పబ్లిక్ ఈవెంట్స్ లో అభిమానులను ఉద్దేశించి మాట్లాడాలని అంటారు. కాని నేను అలా మాట్లాడలేదు. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా నేను మాట్లాడలేక పోతున్నాను. పబ్లిక్ ఈవెంట్స్ లో ఎక్కవగా మాట్లాడేందుకు ధైర్యం సరిపోవడం లేదని ప్రభాస్ చాలా ఇన్నోసెంట్‌ గా వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి తన అభిమానులను ఇరిటేట్‌ చేస్తున్నాను.

రాధేశ్యామ్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో గతంతో పోల్చితే ప్రభాస్ కాస్త యాక్టివ్‌ గా కనిపించాడు. ప్రభాస్ పద్దతి ముఖ్యంగా మీడియాతో ఇంట్రాక్ట్‌ అయిన విధానం చూస్తుంటే ప్రభాస్ లో మార్పు వస్తుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

నా వల్ల అభిమానులు చిరాకు పడి ఉంటారు.. బాధ పడి ఉంటారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఆయనలో వచ్చిన మార్పును సూచిస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ముందు ముందు ప్రభాస్ నుండి మరింతగా మార్పును అభిమానులు ఆశిస్తున్నారు.