Begin typing your search above and press return to search.

అంతేగా.. అంతేగా: అంత లేదనుకున్నాడట!

By:  Tupaki Desk   |   16 May 2019 2:25 PM GMT
అంతేగా.. అంతేగా: అంత లేదనుకున్నాడట!
X
ఈ ఏడాది ఘన విజయం సాధించిన లిస్టులో 'F2' ఒకటి. నిజానికి 2019 కు ఇది ఫస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా హిట్ కావడంతో పాటుగా కొన్ని డైలాగులు ఎంతో పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా 'అంతేగా అంతేగా' అనే డైలాగ్ జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. హీరో వెంకటేష్ ఈ డైలాగ్ చెప్పే విధానం అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది కానీ ఇది నిజానికి వెంకీ డైలాగ్ కాదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రదీప్ డైలాగ్.

టీవీ యాక్టర్ కమ్ క్యారెక్టర్ అరిస్ట్ అయిన ప్రదీప్ 'ఎఫ్ 2' లో హీరోయిన్ తమన్నాకు తండ్రి పాత్రలో నటించారు. ఆయనకు సినిమా అంతా ఉండేది ఒకే డైలాగ్.. అదే 'అంతేగా అంతేగా'. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ప్రదీప్ మాట్లాడుతూ ఈ క్యారెక్టర్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడి తనకు మొదటిసారి చెప్పినప్పుడు "ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది... మీరు చేయాలి" అన్నారట. ఏం క్యారెక్టర్ అని అడిగితే "తమన్నాకు తండ్రి పాత్ర.. సినిమా అంతా ఉంటుంది" అని చెప్పారట . అయితే కొన్ని రోజుల తర్వాతా మళ్ళీ కలిసినప్పుడు డీటెయిల్స్ అడిగితే "సినిమా అంతా మీకు ఒకే డైలాగ్ ఉంటుంది సార్" అని చెప్పారట.

ఒకే డైలాగ్ అనగానే ప్రదీప్ ఈ పాత్ర చెయ్యాలా వద్దా.. అనే ఆలోచనలో పడిపోయారట దీంతో అనిల్ రావిపూడి "డైలాగ్ ఒక్కటే కానీ.. సినిమా అయిపోయిన తర్వాత మీ డైలాగ్ ఆడియన్స్ అందరూ చెప్పుకుంటారు" అని కన్విన్స్ చేశారట. ఈ విషయం చెప్తూ.. అనిల్ గారు చెప్పినట్టే జరిగిందని.. ఆ డైలాగ్ చాలా పాపులర్ అయిందని ప్రదీప్ సంతోషం వ్యక్తం చేశారు.