Begin typing your search above and press return to search.

ప్రగతికి 'హీరో' అంటే ఆ ఇద్దరేనట.!

By:  Tupaki Desk   |   22 Oct 2022 3:21 AM GMT
ప్రగతికి హీరో అంటే ఆ ఇద్దరేనట.!
X
క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి టాలీవుడ్లో తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకుంది. యంగ్ ఏజ్ లో ఉన్నపుడు పలు సినిమాల్లో ప్రగతి హీరోయిన్ గా నటించారు. అయితే ఈ బ్యూటీ ఆ సమయంలో సినిమాల కంటే కూడా వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పెళ్లి చేసుకుంది. ఈక్రమంలోనే ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

అయితే ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. ముఖ్యంగా ఇప్పుడున్న స్టార్ హీరోలకు మదర్ రోల్ చేస్తూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి తన వ్యక్తిగత జీవితం, సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న అంశాలను పంచుకున్నారు.

ఇందుకు సంబంధించిన ప్రోమోను సదరు ఛానల్ విడుదల చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో ప్రగతి తాను సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాను? హీరోయిన్ గా తక్కువ సినిమాలు చేయడానికి కారణాలు ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

అలాగే తనకు హీరో అంటే రజనీకాంత్, కమల్ హాసన్ మాత్రమేనని, వారి పక్కన అయితేనే హీరోయిన్ గా చేస్తానని చెప్పే దానినని, అందువల్లే తనకు హీరోయిన్ గా తక్కువ అవకాశాలు వచ్చినట్లు ప్రగతి తెలిపింది. ఇండస్ట్రీలో అందం ఒక ఫ్యాక్టర్ అయితే తనకు అవకాశాలకు కొదవలేదని చెప్పింది. తనకు తాను అందగత్తెనంటూ కితాబు ఇచ్చుకుంది.

అలాగే తాను ఏ విషయాన్ని ఎక్కువగా నానబెట్టనని.. ఇన్ స్టెంట్ గా స్పందిస్తానని చెప్పింది. తన వర్కౌట్స్ వీడియోల గురించి మాట్లాడుతూ జిమ్ చేయడం వల్ల తన బ్యూటీ ఏమి పెరగదని, అయితే దీని వల్ల స్ట్రెంత్, కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పింది.

ఈ వీడియోలను చూసిన అభిమానులు చాలామంది పాజిటివ్ గానే స్పందిస్తారని, కేవలం పదిశాతం మంది మాత్రమే నెగిటివ్ గా స్పందిస్తారని చెప్పింది. ఏనుగు వెళుతుంటే కుక్కలు మెరుతాయని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

దీంతోపాటు తనను ఆంటీ అంటే కోపం వస్తుందా? చేతిపై ఉన్న టాటుకు సంబంధించిన పలు అంశాలపై ప్రగతి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో మాత్రం ఆదివారం రాత్రి 8:30 గంటలకు 'ఆంధ్రజ్యోతి'లో ప్రసారం కానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.