Begin typing your search above and press return to search.
'దోసిట చినుకులు'.. ప్రకాష్ రాజ్ అంతరంగం..
By: Tupaki Desk | 25 Dec 2018 7:26 AM GMTరచయితగా తాను కొత్త జీవితాన్ని సంతృప్తిగా ఆస్వాదిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు - ప్రజాస్వామిక వాది - ‘దోసిట చినుకులు’ పుస్తక రచయిత ప్రకాశ్ రాజ్ వివరించారు. ఆయన కన్నడంలో రాసిన దోసిట చినుకులు పుస్తకాన్ని ‘మిసిమి’ ప్రచురణ సంస్థ తెలుగులో ప్రచురించిది. తాజాగా హైదరాబాద్ లో దోసిట చినుకులు పుస్తకావిష్కరణలో రచయిత ప్రకాశ్ రాజ్ తన అనుభవాలను వివరించారు. తాను ఎప్పుడు పుస్తకం రాస్తాననుకోలేదని కానీ రాయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ‘సినిమా ప్రపంచం ఒక మాయ- ఒక అబద్ధం అని అన్నారు. 53ఏళ్లుగా జీవితంలో నటుడిగా అబద్ధాలు మాట్లాడుతూ సీని మాయలో ఉండిపోయాను’ అని తెలిపారు.
‘‘నేను రాసిన మొదటి పుస్తకం ‘దోసిట చినుకులు’. నాకు బాగా చదివే అలవాటు ఉంది. కానీ రాయడంలో అలసట ఇప్పడే తెలుస్తుందని - రాయడం నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది’ అని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక తాను రాయకుండా ఉండలేనని చెప్పారు.
తాను పొందిన అనుభవాలు ప్రపంచాన్నిసూక్ష్మంగా పరిశీలించే శక్తిని ఇచ్చిందని, అలాంటి అనుభవాలనే పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకొచ్చానని అన్నారు. ఒక నటుడిగా తనకు ఇచ్చిన క్యారెక్టర్లో నటించానని కానీ అదంతా అబద్దమని - మాయ అన్నారు. అది నిజమైన జీవితం కాదని తెలిపారు. నేను మాయను కాదు.. ఒక వాస్తవాన్ని అనే నిజాన్ని అక్షరాల్లో ఆవిష్కరించినట్లు తెలిపారు. ఇక నేను ఎంతమాత్రం రహస్యం కాదని వివరిస్తూ ‘దోసిట చినుకులు’ పుస్తకాన్ని నేపథ్యాన్ని తెలిపారు.
దోసిట చినుకులు పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకుడు సీతారామ్ సమీక్షించారు. దీనిలో ఒక్కొక్క అనుభవం మనిషికి, ప్రకృతికి ముడిపడిన అనుబంధాన్ని గుర్తు చేస్తుందన్నారు. బీసీ కమిషన్ సభ్యులు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ నటుుడు తనికెళ్ల భరణి - సీని దర్శకుడు కృష్ణవంశీ - ప్రముఖ వ్యాఖ్యాత ఓలేటి పార్వతీశం - మిసిమి సంపాదకులు వల్లభనేని అశ్వనీకుమార్ - హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి కోయ చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.