Begin typing your search above and press return to search.

ఆ బాబు ప్రమోషన్లకు హ్యాండ్ ఇచ్చాడే?

By:  Tupaki Desk   |   1 Dec 2017 10:52 AM GMT
ఆ బాబు ప్రమోషన్లకు హ్యాండ్ ఇచ్చాడే?
X
ఇప్పుడు సినిమాను ఎలా తీశాం ఎంత పెట్టి తీశాం అనేదానికంటే.. అసలు సినిమాను ఏ రేంజులో ప్రమోట్ చేశాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా కూడా ప్రమోషన్లు లేకపోతే జనాలకు ఎక్కట్లేదు. ప్రమోషన్స్ ఉంటేనే భారీ కలక్షన్లు వస్తున్నాయి. ఈ విషయం గ్రహించిన 'జవాన్' టీమ్ ఊరూరా తిరిగి తమ సినిమాను బాగానే ప్రమోట్ చేసుకున్నారులే.

అదే తరహాలో ఏదన్నా సినిమాలో స్పెషల్ పాత్రలను చేసిన వారు కూడా సినిమాను ప్రమోట్ చేస్తే బాగుంటుంది. అదిగో ఇప్పుడు జవాన్ సినిమాలో నెగెటివ్ పాత్రలో ఇంప్రెస్ చేద్దాం అని ప్రయత్నిస్తున్న ప్రసన్న ఉన్నాడే.. అతను కూడా అదే కోవలోకి వస్తాడు. మరి సినిమాలో అయిత ధృవ సినిమాలో అరవింద్ స్వామి తరహాలో ఇంప్రెస్ చేద్దాం అని ప్రయత్నించిన హీరోయిన్ స్నేహ మొగుడు.. సినిమా ప్రమోషన్లలో మాత్రంఎక్కడా కనిపించలేదు. ఎంతసేపు సాయిధరమ్ అండ్ మెహ్రీన్ మాత్రమే కనిపించారు.

నిజానికి జవాన్ సినిమా టీమ్ ప్రమోషన్లకు ప్రసన్నను పిలుద్దాం అనుకున్నా కూడా.. అతను మాత్రం వర్క్ షెడ్యూల్ బిజీగా ఉండటం వలన రాలేనని చెప్పాడట. కట్ చేస్తే గత రెండు రోజుల్లో చెన్నయ్ లో కొన్ని షాపు ఒపెనింగులకు ఈవెంట్లకు తన భార్యతో కలసి వస్తున్నారు. ప్చ్. మనోళ్ళు పక్క రాష్ట్రాల నటులపై మోజు పడటం.. వారు ప్రమోషన్లకు హ్యాండివ్వడం.. అనాదిగా వస్తున్న తంతేలే!!