Begin typing your search above and press return to search.
విడాకుల బాటలో 'ప్రేమ' పెళ్లి
By: Tupaki Desk | 3 March 2016 12:27 PM GMTసౌత్ లో అన్ని భాషల్లోనే నటించి మెప్పించిన హీరోయిన్ ప్రేమ. సినీ రంగంలో మంచి పొజిషన్ లో ఉన్నపుడే పెళ్లి బాట పట్టిన ప్రేమ.. ఇప్పుడు విడాకులకు అప్లై చేసింది. 2006లో జీవన్ అప్పచ్చు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ.. విడాకులకు దరఖాస్తు చేయడం ఆశ్చర్యం కలిగించింది. భార్యాభర్తల మధ్య విబేదాలు తలెత్తడంతో ప్రేమ ఈ నిర్ణయం తీసుకుందని శాండల్ వుడ్ వర్గాలు అంటున్నాయి.
విడాకులు కోరుతూ బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకుంది ప్రేమ. కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రేమ.. హఠాత్తుగా మార్చ్ 2న ఫ్యామిలీ కోర్టులో కనిపించడం ఆశ్చర్యాన్ని కిలిగించింది. అయితే.. తనకు విడాకులు కావాలంటూ కోర్టులో పిటిషన్ వేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇద్దరి మధ్యా భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయని, అవి తీరే పరిస్థతి లేకపోవడంతో పరస్పర అంగీకారంతోనే దరఖాస్తు సమర్పిస్తున్నామని పిటిషన్ లో రాసింది ప్రేమ.
నేరుగా కోర్టుకు హాజరై విడాకులకు దరఖాస్తు చేసింది ప్రేమ. భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించడంతో.. 'ప్రేమ' పెళ్లి పెటాకులు అయ్యి.. విడాకులు రావడానికి మరెంతో సమయం పట్టకపోవచ్చని అంటున్నారు.