Begin typing your search above and press return to search.

పృథ్వీ ఆడియో వాయిస్‌ క‌ల‌క‌లం

By:  Tupaki Desk   |   7 Oct 2021 11:30 AM GMT
పృథ్వీ ఆడియో వాయిస్‌ క‌ల‌క‌లం
X
టాలీవుడ్‌లో `మా` ఎన్నిక‌లు కాక పుట్టిస్తున్నాయి. సాధార‌ణ ఎన్నిక‌ల‌ని మించి రాజ‌కీయం ఇక్క‌డ రంగులు మారుతోంది. పూట‌కో అప్‌డేట్‌.. రోజుకో ట్విస్ట్ ల‌తో `మా` ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయానికి తెర‌లేపాయి. ఇక ఎన్నిక‌ల తేదీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా కొద్దీ రాజ‌కీయం మ‌రింత‌గా వేడెక్కుతోంది. ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ స‌భ్యుల వాదోప‌వాదాలు.. విమ‌ర్శ‌లు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో డ‌బ్బులు పంచ‌డ‌మే కాకుండా బెదిరింపుల ప‌ర్వం కూడా మొద‌లైంది.

మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ చేస్తున్న న‌టుడు పృథ్వీ , వైసీపీ కార్య‌క‌ర్త ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యుడితో జ‌రిపిన ఫోన్ సంభాష‌ణ ఇప్పుడు టాలీవుడ్‌లో క‌ల‌క‌ల‌కం సృష్టిస్తోంది. దేశంలో ఎవ‌రు ఎక్క‌డి ననుంచైనా పోటీ చేయోచ్చు కానీ పాలించే అర్హ‌త మాత్రం వుండ‌ద‌ని చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. `మా` ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డుతున్న ప్ర‌కాష్‌రాజ్‌ని విజ‌య‌వాడ‌లో స‌న్మానించ‌డం త‌న‌కు న‌చ్చ‌లేద‌ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.

తెలుగు న‌టులు ఎంతో మంది వుండ‌గా ఎక్క‌డి నుంచో వ‌చ్చిన ఆర్టిస్ట్‌కు స‌న్మానం చేయ‌డం త‌న‌కు బాధ‌ను క‌లిగించింద‌న్నారు. నాకు వైజాగ్‌తో మంచి అనుబంధం వుంది. అక్క‌డ ఎంతోమంది స‌న్నిహితులున్నారు. నా రాజ‌కీయ జీవితం మొద‌లైంది వైజాగ్‌లోనే. ప్ర‌కాష్‌రాజ్‌ను స‌న్మానించ‌డం నాకు న‌చ్చ‌లేదు. ఎక్క‌డి నుంచో వ‌చ్చిన అత‌నికి `మా` ఎన్నిక‌ల కోసం మీరెలా స‌పోర్ట్ చేస్తారు. అత‌నికి క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని చాంబ‌ర్ రెండు సార్లు స‌స్పెండ్ చేసింది. నేను క‌న్న‌డంలో ఓ షూటింగ్ కోసం ఆడ‌వేశం వేస్తే నా విగ్గు పీకేసి ఇక్క‌డ క‌న్న‌డ వాళ్లు మాత్ర‌మే న‌టించాలి అంటూ నాపై కేక‌లు వేశారు. దాంతో సిగ్గుతో త‌ల‌దించుకుని వ‌చ్చాను.

భార‌త దేశంలో ఎవ‌రు ఎక్క‌డైనా పోటీ చేయ‌వ‌చ్చు కానీ మ‌న‌ల్ని మాత్రం పాలించ‌కూడ‌దు. మీకు ఆయ‌న ఎందుకు న‌చ్చాడు. ప‌ర‌భాషా న‌టుల మీద మీకు అంత ఇష్టం ఏమిటి? తెలుగు వాడిని గెలిపిద్దాం.. తెలుగు ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుదాం. అంటూ పృథ్వీ మాట్లాడిన ఆడియో వాయిస్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.