Begin typing your search above and press return to search.

జబర్దస్త్ పాపతో 30 ఇయర్స్ పృథ్వీ… ఏం చేస్తున్నారంటే?

By:  Tupaki Desk   |   12 Feb 2023 1:00 PM GMT
జబర్దస్త్ పాపతో 30 ఇయర్స్ పృథ్వీ… ఏం చేస్తున్నారంటే?
X
30 ఇయర్స్ పృథ్వీగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు పృథ్వీరాజ్. ఎప్పుడో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన పృథ్వీరాజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. నటుడిగా మంచి బజ్ లో ఉండగానే రాజకీయాలలోకి వెళ్లి వైసీపీకి మద్దతుగా గత ఎన్నికలలో ప్రచారం చేశారు. ఆ సమయంలో మెగా ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ మీద పృథ్వీ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు.

ఇక పృథ్వీరాజ్ ని గుర్తించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి ఎస్వీబీసీ భక్తి చానల్ చైర్మన్ హోదా ఇచ్చి గౌరవించింది. ఆ పదవిలో ఉండగానే ఓ ఫోన్ కాల్ ఆడియో బయటకి రావడంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పృథ్వీరాజ్ ని తప్పించారు. అయితే తనకంటే ముందుగా ఎమ్మెల్యేలు ఆడియో కాల్స్ లీక్ అయిన కూడా వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. అయితే తన ఆడియో ఒరిజినల్ కాదని పృథ్వీరాజ్ ఎంత మొత్తుకున్నా, వైసీపీ అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు.

వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా అతన్ని తీవ్రంగా ట్రోల్ చేసింది. దీంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బయటకి వచ్చేసిన పృథ్వీరాజ్ ప్రస్తుతం జనసేనతో కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య మళ్ళీ నటుడిగా పృథ్వీరాజ్ బిజీ అవుతున్నారు. ఓ వైపు నటుడిగా వెండితెరపై మెరుస్తూనే బుల్లితెరపై కూడా రియాలిటీషోలలో సందడి చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా జబర్దస్త్ కామెడీ రియాలిటీషోలో లేడీ గెటప్స్ తో గుర్తింపు తెచ్చుకున్న తన్మయి తరువాత ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిపోయాడు. ప్రస్తుతం తన్మయితో పృథ్వీరాజ్ డాన్స్ చేసిన వీడియోని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో పృథ్వీరాజ్ రొమాంటిక్ గా తన్మయితో డాన్స్ చేస్తూ ఉండటం ఉండటం. ఇప్పుడు ఆ వీడియో చూస్తున్నవారు అమ్మనా బత్తాయో మీలో మంచి రసికుడు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.