Begin typing your search above and press return to search.
రాహుల్.. మళ్లీ రచ్చ తప్పదా..?
By: Tupaki Desk | 27 May 2023 11:29 AMప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. అలా అని ప్రతిరోజూ ఏవేవో పోస్టులు పెడతారా అంటే పెట్టరు. కానీ ఆయనకు పెట్టాలని అనిపించినప్పుడు మాత్రం పెట్టకుండా ఉండలేరు. అలా పెట్టిన పోస్టులు మాత్రం కచ్చితంగా పేలుతూ ఉంటాయి.
తాజాగా, ఆయన హైదరాబాద్ గురించి కొన్ని వ్యాఖ్యాలను పెట్టారు. వాటిల్లో అన్ని లైన్లు బాగానే ఉన్నాయి. కానీ ఒక్క లైన్ మాత్రం తేడా కొడుతోంది. I wish Hyderabad isn’t about Hindu vs Muslim అనే వ్యాఖ్యం ఇప్పుడు తేడా కొట్టడం మొదలుపెట్టింది. ఆయన కాజ్యువల్ గానే పెట్టి ఉండొచ్చు. కానీ నెటిజన్లు మాత్రం దానిని హైలెట్ చేసి మరీ ఆయనపై కౌంటర్లు వేయడం మొదలుపెట్టారు.
నిజానికి ఎన్ని పాజిటివ్ పోస్టులు పెట్టినా ఎవరూ పట్టించుకోరు. కానీ, నెగిటివ్ వి మాత్రం ఎక్కడ ఉన్నా వెతికి, గాలించి మరీ పట్టుకొని దానిని నానా రాద్ధాంతం చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాహుల్ పెట్టిన పోస్టులోనూ ఈ హిందు, ముస్లిం అనే వ్యాఖ్యాన్ని కొందరు హైలెట్ చేయాలని చూస్తున్నారట. ఇది రాజకీయంగానూ దారితీసే అవకాశం ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఎంత రచ్చ అవుతుందో.
ఈ సంగతి పక్కన పెడితే, రాహుల్, గతంలో తాను ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసే విధానం కూడా వివాదాస్పదమైంది. ఆమెకు లిప్ లాక్ ఇచ్చిన ఫోటోని షేర్ చేసి మరీ ఆయన ఈ విషయం చెప్పడం గమనార్హం. అంతేకాకుండా, ఈయన పెళ్లికి ముందే తండ్రి అయ్యారు.
ఇక కెరీర్ విషయానికి వస్తే, చాలా సినిమాల్లో ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం విమానం అనే సినిమాలో నటిస్తున్నారు. దీనిలో అనసూయ వేశ్య పాత్రలో నటిస్తుండగా, ఆమెను చూసి ఆరాధించే పాత్రలో రాహుల్ కనిపించనున్నాడు. ఇటీవల దానికి సంబంధించిన ఓ పాట విడుదల చేయగా, అది బాగా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి పాత్రలు సినిమాకు బాగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.