Begin typing your search above and press return to search.

రైలుప్రమాదం: ఎరక్క పోయి ఇరుక్కుపోయిన రాహుల్ రామకృష్ణ

By:  Tupaki Desk   |   4 Jun 2023 2:50 PM IST
రైలుప్రమాదం: ఎరక్క పోయి ఇరుక్కుపోయిన రాహుల్ రామకృష్ణ
X
ఒడిశా రాష్ట్రంలో జరిగిన రైళ్ల ప్రమాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి ఒకే చోట మూడు రైళ్లు ప్రమాదానికి గురవగా 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1000 మందికి పైగా తీవ్రంగా గాయాలు పాలవడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఒకపక్క ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్న సమయంలో సోషల్ మీడియాలో చనిపోయిన వారికి సంతాపం వ్యక్తం చేస్తూ గాయాల పాలైన వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అనేకమంది పోస్టులు పెడుతున్నారు.

అయితే ఇలాంటి సమయంలో రాహుల్ రామకృష్ణ ఒక ట్వీట్ చేయడం దుమారాన్ని రేకెత్తించింది.

ఆయన తెలిసి ట్వీట్ చేశాడో తెలియక ట్విట్ చేశాడో కానీ ఒక రైలు బొమ్మలు ఉన్న గిఫ్ ఇమేజ్ చేయడంతో అది ఫన్నీగా ఉండడంతో నేటిజన్లు ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల మంది రైలు ప్రమాదంలో చనిపోతే నీకు నవ్వొస్తుందా రైలు చేసే విన్యాసాలు షేర్ చేస్తున్నావేంటి అంటూ ఆయన మీద మండి పడటంతో వెంటనే రాహుల్ రామకృష్ణ అలర్ట్ అయ్యాడు.

ఆ ట్వీట్ డిలీట్ చేసిన ఆయన ముందుగా చేసిన ట్వీట్ విషయంలో నన్ను క్షమించాలని ఈ రైళ్ల ప్రమాద విషయం గురించి తనకు నిజంగా తెలియదని చెప్పుకొచ్చాడు. అర్ధరాత్రి నుంచి స్క్రిప్ట్ రాస్తూ కూర్చున్నాను. కాబట్టి వార్తలు ఫాలో అవ్వలేదు. తను క్షమించాలంటూ ఆయన ట్విట్ చేసుకొచ్చాడు. దీంతో నెటిజెన్స్ కొంతవరకు ఆయనను క్షమించిన పరిస్థితి కనిపించింది.

కొన్ని గంటలుగా తాను వార్తలు మీద ఫోకస్ పెట్టలేదని తనకు తెలియకుండానే జరిగిన పొరపాటు ఇదంటూ రాహుల్ రామకృష్ణ చెప్పుకొచ్చాడు. అయితే నిజానికి ఆయన గతంలో కూడా కొన్ని సంఘటన జరిగినప్పుడు సిల్లీగా స్పందించిన దాఖలాలు ఉన్నాయంటూ కూడా నెటిజన్లు జనరల్ కామెంట్లు చేస్తున్నారు. సైన్మా అనే షార్ట్ ఫిలిం ద్వారా తరుణ్ భాస్కర్ ఆయనను నటనకు పరిచయం చేశారు. ప్రస్తుతానికి తెలంగాణ యాసలో మాట్లాడే అతి తక్కువ మంది కమెడియన్లలో రాహుల్ రామకృష్ణ ఒకరిగా ఉన్నారు