Begin typing your search above and press return to search.

వెట‌ర‌న్ స్టార్ రిషీకపూర్ ఇక లేరు

By:  Tupaki Desk   |   30 April 2020 4:35 AM GMT
వెట‌ర‌న్ స్టార్ రిషీకపూర్ ఇక లేరు
X
బాలీవుడ్ వెట‌ర‌న్ న‌టుడు రిషీక‌పూర్(67) ఇక లేరు. ముంబైలోని ఓ ప్ర‌యివేట్ ఆస్ప‌త్రిలో ఆయ‌న మ‌ర‌ణించారు. ఈ మ‌ర‌ణ వార్త విన్న వెంట‌నే రిషీజీ స్నేహితుడు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియాలో స్పందించారు. ``రిషీ క‌పూర్ కొద్దిసేప‌టి క్రిత‌మే మ‌ర‌ణించారు. హి ఈజ్ గాన్..! రిషీ క‌పూర్ .. గాన్.. జ‌స్ట్ పాస్ డ్ అవే.. ఐ యామ్ డిస్ట్రాయ్డ్!`` అంటూ అమితాబ్ జీ తీవ్ర‌క‌ల‌త‌కు గుర‌య్యారు.

ఇక రిషీజీ ఆరోగ్యంపై ఇటీవ‌ల ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వెలువ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. 67 ఏళ్ల‌ ఈ న‌టుడు క్యాన్స‌ర్ కి చికిత్స పొందుతున్నారు. ఏజ్ సంబంధ సమ‌స్య‌లు ఉన్నాయి. ఆ క్ర‌మంలోనే ప‌లుమార్లు తీవ్ర అస్వ‌స్థ‌త‌తో ముంబై రిల‌యన్స్ ఆస్ప‌త్రిలో చేరారు. ఆయ‌న‌కు మ‌రోసారి స‌మ‌స్య తీవ్ర‌మ‌వ్వ‌డంతో బుధవారం రాత్రి ముంబైలోని ఆసుపత్రికి తరలించామని అతని సోదరుడు రణధీర్ కపూర్ చెప్పారు.

ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ముంబైలోని హెచ్ ఎన్ రిలయెన్స్ ఆసుపత్రిలో చికిత్స అందుతుండ‌గా స్నేహితుడి మ‌ర‌ణ‌వార్త‌ను అమితాబ్ బ‌య‌టి ప్ర‌పంచానికి వెల్ల‌డించారు. ఆసుపత్రిలో రిషికపూర్ వెంట అతని భార్య నీతూకపూర్ ఉన్నారని ఇంత‌కుముందు రణధీర్ కపూర్ చెప్పారు. తన తండ్రి ఆసుపత్రిలో చేరడంతో హీరో రణబీర్ కపూర్ బుధవారం రాత్రి ఆసుపత్రికి చేరుకున్నారు. రిషికపూర్ కు 2018లో కేన్సర్ రావడంతో న్యూయార్క్ లో చికిత్స పొందారు. అనంత‌రం ఆరోగ్య స‌మ‌స్య‌లు ప‌దే ప‌దే తిర‌గ‌బెడుతూనే ఉన్నాయన్న స‌మ‌చారం ఉంది. అయితే రిషీజీ ఆరోగ్యంగా ఉన్నార‌ని చెబుతూనే ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం అభిమానుల్ని క‌ల‌చి వేస్తోంది. అందుకు కార‌ణం అడిగితే ఆయ‌న సోద‌రుడు ర‌ణ‌ధీర్ వివ‌రాల్ని వెల్ల‌డించేందుకు నిరాక‌రించారు.

ప్ర‌స్తుతం లాక్ డౌన్ సందర్భంగా రిషీజీ యోగా చేస్తూ ఆరోగ్యంపై శ్ర‌ద్ధ తీసుకుంటున్నారు. కోలుకుంటార‌నే అభిమానులు భావించారు. ఇక అత‌డు యోగా చేస్తున్న ఫోటోల్ని రిషీకపూర్ భార్య సామాజిక మాధ్య‌మాల్లో ఇంత‌కుముందు షేర్ చేశారు. బాబీ చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం అందుకున్న రిషీజీ కెరీర్ అంచెలంచెలుగా వెలుగొందింది. బాలీవుడ్ లో ప్ర‌ముఖ హీరోల‌తో క‌లిసి ప‌లు క్లాసిక్స్ లో న‌టించారు. ఇటీవ‌లే అమితాబ్ తో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఓ వెబ్ సిరీస్ లోనూ ఆయ‌న‌ కనిపించారు. ఆయ‌న లేని లోటు బాలీవుడ్ కి ఎప్ప‌టికీ ఉంటుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు.