Begin typing your search above and press return to search.
సాయిపల్లవికి తండ్రిగా చేయడంలో సంతృప్తి ఉంటుంది!
By: Tupaki Desk | 20 Jun 2022 12:30 AM GMTకొంతకాలం క్రితం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ' ఫిదా' చూసినవాళ్లు, ఆ సినిమాను ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సినిమాలోని తండ్రీకూతుళ్ల అనుబంధం మనసులను కట్టిపడేస్తుంది. పెళ్లి పేరుతో తండ్రికి దూరంగా వెళ్లడం ఇష్టం లేని ఒక ఆడపిల్ల కథ ఇది. తెలంగాణ ప్రాంతంలో తండ్రీ కూతుళ్ల మధ్య ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉంటాయనేది చాటిచెప్పిన కథ ఇది. ఆ సినిమాలో తండ్రి పాత్రలో సీనియర్ నటుడు సాయిచంద్ జీవించారు. తాజాగా వచ్చిన 'విరాటపర్వం' సినిమాలోను ఆయన సాయిపల్లవికి తండ్రిగానే మెప్పించారు.
ఈ రోజున 'ఫాదర్స్ డే' సందర్భాన్ని పురస్కరించుకుని జరిగిన ఇంటర్వ్యూలో సాయిచంద్ మాట్లాడుతూ .. "సినిమాల్లో సాయిపల్లవికి మాత్రమే తండ్రిగా నటించడానికి నేను ఇష్టపడతాను. 'ఫిదా' సినిమాలో నేను అంత బాగా చేయడానికి కారణం సాయిపల్లవినే. తను నిజంగానే నా కూతురులా అనిపించడం వలన అలా చేయగలిగాను. అందువల్లనే ఆ పాత్ర అంతగా అందరికీ కనెక్ట్ అయింది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య తండ్రికూతుళ్ల అనుబంధం అలాగే ఉంది. 'విరాటపర్వం' సినిమాలో ఆమెకి తండ్రి పాత్ర చేయడానికి గల కారణం అదే.
సాయిపల్లవికి .. నాకు విడదీయరాని బంధమేదో ఉండి ఉంటుంది. తను పుట్టినప్పుడు నేను సినిమాలు చేయడం ఆపేశాను. ఆ తరువాత ఆమె చేసిన 'ఫిదా'తోనే రీ ఎంట్రీ ఇచ్చాను. ఇది యాధృచ్ఛికమే అయినా .. ఏదో కారణం లేకపోతే ఇలా జరగదు కదా అనిపిస్తూ ఉంటుంది. సాయిపల్లవికి కాకుండా మరెవరికైనా తండ్రిగా నటించాలంటే ఆలోచన చేయవలసి వస్తోంది. 'ఉప్పెన' సినిమాలో తన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కి తండ్రిగా చేయమని చిరంజీవిగారు అడిగితే కూడా నేను ఆలోచన చేశాను.
నిజ జీవితంలో ఒక తండ్రి ఎమోషన్స్ ఎలా ఉంటాయనేది నాకు తెలియదు .. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోలేదు. ఎవరినో పేమించి .. ఆ ప్రేమ విఫలం కావడం వలన నేను పెళ్లి చేసుకోలేదనే రూమర్స్ ఉన్నాయి. వాటిలో ఎంతమాత్రం నిజం లేదు. పెళ్లి చేసుకోకుండా ఉండటం వెనుక బలమైన కారణం కూడా ఏమీ లేదు. కాలం అలా గడిచిపోయిందంతే. పెళ్లి చేసుకోకపోయినా నా వాళ్లంతా ఉన్నారు. నా మేనల్లుళ్లు .. మేనకోడళ్లు .. కజిన్స్ .. ఇలా అందరూ ఉండటం వలన ఒంటరితనమనేది తెలియదు" అంటూ చెప్పుకొచ్చారు .