Begin typing your search above and press return to search.
హీరోకి ఈ బయోపికయినా కలిసొస్తుందా ?
By: Tupaki Desk | 14 Nov 2019 1:30 AM GMTప్రస్తుతం అన్ని భాషల్లో బయోపిక్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. టాలీవుడ్ లో కూడా ఇప్పుడిప్పుడే ప్రముఖుల కథలు సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే తెలుగులో ఒకే రెండు బయో పిక్ సినిమాల్లో నటించి బయోపిక్ హీరో అనిపించుకుంటున్నాడు. అతనే సాండీ అలియాస్ సందీప్ . అప్పటికే ఏవో రెండు మూడు సినిమాలు చేసినా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'జ్యోతి లక్ష్మి' తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాండీ.
జ్యోతి లక్ష్మి చేసిన పరిచయంతో పూరికి దగ్గరయ్యాడు. అయితే పూరి క్యాంప్ లో ఇతగాడిని చూసి వంగవీటి సినిమాలో అవకాశం ఇచ్చాడు. వంగవీటి మోహన రంగా బయోపిక్ గా తెరకెక్కిన ఆ సినిమాలో బాగా నటించి మంచి మార్కులే అందుకున్నాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాదించలేదు. ఎందుకో వర్మ తీసిన ఆ బయోపిక్ ఎవరికీ పెద్దగా ఎక్కలేదు. కట్ చేస్తే మళ్ళీ ఓ బయోపిక్ తో వచ్చాడు సాండీ.
అయితే ఈసారి ఓ స్టూడెంట్ లీడర్ బయోపిక్ తో వస్తున్నాడు. జార్జ్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇదే నెలలో రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం టీజర్స్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమాను త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా ప్రమోట్ చేయనున్నాడు. సో మొదటి బయోపిక్ తో మెప్పించలేకపోయిన ఈ బయోపిక్ స్టార్ జార్జ్ రెడ్డి తో అయినా ఓ అదిరిపోయే హిట్ అందుకుంటాడెమో చూడాలి.