Begin typing your search above and press return to search.

ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

By:  Tupaki Desk   |   8 Jun 2023 8:00 PM GMT
ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
X
ఎవరికైనా తమ అభిమాన హీరో గురించి, హీరోయిన్ గురించి తెలుసుకోవాలని ఆరాట పడుతుంటారు అభిమానులు. గత కొన్ని రోజులుగా స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ల త్రో బ్యాక్ ఫోటోస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. వారి అరుదైన పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. అలా ఓ హీరో ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అందాల తార ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఇప్పటికీ ఆ సినిమా పాటలు వింటూ ఉంటారు. అందులోని కహీన్ ఆగ్ లగే లాగ్ జాయే అనే సాంగ్‌ బ్యాక్ గ్రౌండ్ లో ఓ హీరో డ్యాన్సర్ గా చేశాడు. అయితే ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఆ హీరో ఎవరో గుర్తు పట్టేశారా? మీరు అనుకున్నది నిజమే. ఇప్పుడు టాప్ హీరోగా కొనసాగుతున్న షాహిద్ కపూర్ ఫోటోనే అది.

బాలీవుడ్ లో షాహిద్‌ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. 2003 లో ఇష్క్ విష్క్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. అయితే ఈ మువీ కంటే ముందు నుంచి కూడా షాహిద్ సినిమాల్లో కొనసాగాడనే విషయం చాలా మందికి తెలియదు. అప్పటి సినిమాలో బ్యాక్‌ గ్రౌండ్‌ డ్యాన్సర్‌ గా పని చేసేవాడు. అలా ఐశ్వర్య రాయ్ నటించిన తాల్ సినిమాలోని ఓ సాంగ్ లో బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా షాహిద్ చేశాడు.

అయితే ఈ విషయాన్ని షాహిద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తాను సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో డ్యాన్స్ చేసినట్లు గుర్తుకు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.

ఈ హీరో ప్రధాన పాత్రలో నటించిన బ్లడీ డాడీ సినిమా జూన్ 9వ తేదీన అడియన్స్ ముందుకు రానుంది. డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ సినిమా 2011లో వచ్చిన ఫ్రెంచ్ మూవీ స్లీప్ లెస్ నైట్ చిత్రానికి అడాప్షన్ గా తెరకెక్కుతుంది. ప్రముఖ ఓటీటీ జియో సినిమాలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.