Begin typing your search above and press return to search.
శర్వానంద్ కి ఇక నుండైనా కలిసి వచ్చేనా..?
By: Tupaki Desk | 5 Jun 2023 10:00 PM GMTయువ హీరోల్లో విలక్షణ నటుడిగా తనను తాను మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు శర్వానంద్. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ముందు సైడ్ రోల్స్ చేసి వెన్నెల సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చాడు శర్వానంద్. తన మార్క్ సినిమాలు చేస్తూ వస్తున్న ఈ యువ హీరోకి ఈమధ్య అదృష్టం కలిసి రావట్లేదు. కెరీర్ లో గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు లాంటి సినిమాలు తీసిన శర్వానంద్ ఈమధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. 2017లో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత దాదాపు ఆరేళ్లుగా శర్వానంద్ ఖాతాలో ఒక్క హిట్ పడలేదని చెప్పొచ్చు.
ప్రస్తుతం శర్వానంద్ తన 35వ సినిమా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా బ్యాచిలర్ లైఫ్ కి ముగించి పెళ్లి చేసుకున్నాడు శర్వానంద్. శర్వానంద్ రక్షిత శెట్టిని పెళ్లాడారు. రీసెంట్ గా వీరి మ్యారేజ్ కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది. పెళ్లి హడావిడి లో ఉన్న శర్వానంద్ దాదాపు 3 నెలల నుంచి సినిమా విషయాలన్నీ పక్కన పెట్టేశాడు.
తను చేస్తున్న సినిమా షూటింగ్ కి కూడా మరో రెండు నెలల దాకా బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. శర్వానంద్ కెరీర్ ప్రస్తుతం అటు ఇటుగానే ఉంది. అయితే హీరోల కెరీర్ అనూహ్యంగా పెళ్లి తర్వాత మారిపోతుంది. కొందరు స్టార్స్ కి ఆఫ్టర్ మ్యారేజ్ లక్ కలిసి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు పడతాయి. శర్వానంద్ క్ కూడా ఇక నుండైనా కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి. శర్వానంద్ ఎంచుకునే కథలు బాగున్నా ఎగ్జిక్యూషన్ విషయంలో పొరపాట్ల వల్ల ఫలితాలు తేడా కొట్టేస్తున్నాయి.
పెళ్లి తర్వాత స్టార్స్ గా మారిన ఎంతోమంది హీరోలు ఉన్నారు. వారి దారిలోనే మ్యారేజ్ తర్వాత శర్వానంద్ కెరీర్ ఊపందుకుంటుందా.. వరుస సక్సెస్ లు అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. శర్వా 35వ సినిమా చివరి దశకు చేరుకున్నాక తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ మెంట్ చేయాలని చూస్తున్నాడు శర్వానంద్. ఇప్పటికే ఒకరిద్దరు దర్శకులు తమ దగ్గర ఉన్న కథలతో శర్వానంద్ ను కలిశారట.
శర్వానంద్ కూడా ఫెయిల్యూర్స్ ని పట్టించుకోకుండా తన పంథాలో తాను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. శ్రీరామ్ ఆదిత్య టాలెంటెడ్ డైరెక్టర్ కాబట్టి శర్వానంద్ కి ఒక సూపర్ హిట్ ఇస్తాడని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ శర్వా సినిమా కెరీర్ ఎలా ఉండబోతుంది అన్నది తన నెక్స్ట్ సినిమా రిజల్ట్ ని బట్టి చెప్పొచ్చు.