Begin typing your search above and press return to search.
సిద్దార్థ్ కు డైరెక్టర్ వార్నింగ్
By: Tupaki Desk | 18 Oct 2018 12:03 PM GMTమన దగ్గర జోరు తగ్గింది కానీ బొమ్మరిల్లు ఫేమ్ హీరో సిద్దార్థ్ కు తమిళనాడులో ఇప్పటికీ ఓమాదిరి ఫాలోయింగ్ ఉంది. గత ఏడాది గృహంతో డీసెంట్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ట్విట్టర్ లో మహా యాక్టివ్ గా ఉంటాడు. దేని గురించైనా తన అభిప్రాయాన్ని చెప్పడంలో ఏ మాత్రం మొహమాటపడడు. ఆ మధ్య ప్రభాస్ బర్త్ డే అంటూ ఓ అభిమాని వందల రోజుల ముందే ప్రీ సెలబ్రేషన్స్ అంటూ పోస్ట్ పెడితే దానికి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది సిద్ధార్థే. ఎన్ని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు కూడా.
తాజాగా అన్ని సినిమా పరిశ్రమలను ఊపేస్తున్న మీ టూ ఉద్యమానికి సిద్దార్థ్ తనవంతు బాధ్యత మద్దతు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా గత కొద్దిరోజులుగా పోస్టులు పెడుతూనే ఉన్నాడు. అందులో భాగంగా దర్శకురాలు మణి మేఖలై కు మద్దతు ఇవ్వడం ఏకంగా బెదిరింపుల దాకా వచ్చేసింది. కొద్దిరోజుల క్రితం మణిమేఖలై దర్శకుడు సుశీ గణేశన్ గతంలో తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ గట్టి ఆరోపణలే చేసింది. ఓసారి కారులో డ్రాప్ చేసే నెపంతో వాహనంలోనే తెగబడ్డాడని చెప్పింది. దీనికి సిద్దార్థ్ మద్దతు ప్రకటించాడు. దీంతో సుశీ గణేశన్ సిద్ధార్థ్ తండ్రికి ఫోన్ చేసి ఇలా చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని బెదిరించాడట.
ఈ విషయాన్నీ నిర్ధారిస్తూ సిద్ధార్థ్ స్వయంగా పోస్ట్ చేసాడు. ఇకపై మణిమేఖలైకు గతంలో కంటే ఎక్కువ మద్దతు ఇస్తానని ఇలాంటివి వాటికి బెదిరే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగేలా ఉంది. మణిమేఖలై సుశి గణేశన్ పరస్పరం కేసులు పెట్టుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంతకీ ఈ సుశీ గణేశన్ ఎవరూ అనుకుంటున్నారా. విక్రమ్ తో మల్లన్న అనే సినిమా వచ్చింది గుర్తుందా. దాని దర్శకుడే ఇతను.