Begin typing your search above and press return to search.
#మీటూ : నెటిజన్ పై హీరో ఆగ్రహం
By: Tupaki Desk | 10 Oct 2018 4:25 AM GMTతనూశ్రీ దత్తా తనపై పది సంవత్సరాల క్రితం జరిగిన లైంగిక వేదింపుల విషయాన్ని తాజాగా మీడియా ముందుకు తీసుకు రావడంతో ఎంతో మంది ఇప్పుడు తమపై జరిగిన లైంగిక వేదింపుల గురించి మాట్లాడేందుకు సోషల్ మీడియా ద్వారా ముందుకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఇతర దేశాల్లో ప్రాచుర్యంను దక్కించుకున్న మీటూ ఉద్యమం ఇప్పుడు ఇండియాలో కూడా పాపులర్ అయ్యింది. పలువురు బాలీవుడ్ స్టార్స్ తో పాటు అన్ని వర్గాల వారు కూడా మీటూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ సమయంలోనే తోట్లని కిషన్ అనే నెటిజన్ మీటూ ఉద్యమం పట్ల కాస్త విమర్శనాత్మకంగా పోస్ట్ చేశాడు.
కిషన్ ట్విట్టర్ లో.. లైంగిక వేదింపుల గురించి నేనేం మాట్లాడాలనుకోవడం లేదు, కాని ఎలాంటి ఆధారం లేకుండా ఒక వ్యక్తిపై లైంగిక ఆరోపణలు చేయడం వల్ల ఆ వ్యక్తి పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లినట్లే కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. లైంగిక వేదింపులకు పాల్పడే వారి పట్ల తాను అనుకూలం కాదు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశాడు. కిషన్ ట్వీట్ కు హీరో సిద్దార్థ తనదైన శైలిలో కాస్త సీరియస్ గా స్పందించాడు.
కిషన్ ట్వీట్ కు స్పందనగా సిద్దార్థ ట్విట్టర్ లో స్పందిస్తూ.. మీ అభిప్రాయం చాలా తప్పు - ఎలాంటి ఆధారాలు లేకుండానే రేప్ లకు పాల్పడి కొందరి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. కొంత మంది మహిళలు ఈ విషయమై పోరాటం చేస్తున్న సమయంలో మనం వారికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది - వారి బాధను - ఆవేదనను మనం వినాలి. ఒక సెలబ్రెటీ తన స్థాయిని మరిచి ఇలాంటి విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆమెకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. ముందుగా ఆమెను లైంగికంగా వేదించిన వ్యక్తిపై విచారణ జరిపి శిక్షించాలని అన్నాడు.
ఒక సెలబ్రెటీ తనపై జరిగిన లైంగిక వేదింపుల గురించి మాట్లాడుతూ ఉంటే పబ్లిసిటీ కోసం అంటూ కొందరు వ్యాఖ్యలు చేయడం దారుణమని సిద్దార్థ అన్నాడు. బాలీవుడ్ నుండి కోలీవుడ్ చేరిన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా త్వరలోనే మరింతగా ప్రాచుర్యం పొందే అవకాశం ఉందని విశ్లేషకులు అబిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.