Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా అంటే నాన్సెన్స్ అనేసిన సిద్దార్ధ్!
By: Tupaki Desk | 1 May 2022 7:41 AM GMTపాన్ ఇండియా అనే పదం ఇటీవల బాగా ఫేమస్ అవుతోన్న సంగతి తెలిసిందే. సౌత్ సినిమాలు దేశమంతటా వసూళ్ల ప్రభజంన కొనసాగించడంతోనే సౌత్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా కీర్తింపడుతుంది. `బాహుబలి`...`కేజీఎఫ్`..`ఆర్ ఆర్ ఆర్`..`పుష్ప` సినిమాలతో సౌత్ క్రియేటివిటీ దేశం మొత్తం తెలిసొచ్చింది. ఇప్పుడు సౌత్ ఆడియన్స్ ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు.
అందులోనూ పాన్ ఇండియా అనే పదాన్ని మొదటిసారి పరిచయం చేసింది రాజమౌళి `బాహుబలి`తోనే. ఇండియన్ సినిమా హిస్టరీలో `బాహుబలి` ప్రాంచైజీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇప్పుడు దక్షిణాది సినిమా అంటే దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. అది ఎంతలా అంటే సౌత్ సినిమా సక్సెస్ చూసి బాలీవుడ్ లో కొందరు అసూయపడేంతగా.
అవును కొందరు బాలీవుడ్ ప్రముఖులు సౌత్ క్రియేటివిటీని ఆకాశానికి ఎత్తేస్తే మరికొంత మంది ఎలా పాతాళానికి తొక్కేయాలా? అన్న రీతున స్పందించారు. తాజాగా నటుడు సిద్దార్ధ్ పాన్ ఇండియా సినిమాపై తన ఒపినీయన్ ని కూడా చెప్పుకొచ్చారు.
``పాన్-ఇండియన్ అనేది చాలా అగౌరవకరమైన పదం. పాన్-ఇండియన్ అనేది నాన్సెన్స్! సినిమాలన్నీ భారతీయ చిత్రాలే.15 సంవత్సరాల క్రితం పాన్-ఇండియన్ సినిమా లేదని చెప్పాలా? నా బాస్ మణిరత్నం 'రోజా' అనే సినిమా తీశారు. ఈ సినిమా భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూసారు. చూడని వారు అంటూ ఎవరూ లేరు. ఈరోజు బెంగళూరులోని నా స్నేహితులు 'కేజీఎఫ్' తీశారు. వారి గురించి నేను చాలా గర్వపడుతున్నాను. 'కేజీఎఫ్' భారతీయ సినిమా.
ఇది కన్నడ చిత్రం. మీరు దీన్ని మీకు నచ్చిన భాషలో చూడవచ్చు. కానీ ఇది భారతీయ చిత్రం. కన్నడ పరిశ్రమ తయారు చేసింది. పాన్-ఇండియా అనే పదాన్ని తీసివేయాలి. కేవలం భారతీయ చిత్రం అని పిలవాలి. లేకుంటే దానిని రూపొందించిన భాషలో సూచించండి. తమిళం.. తెలుగు సినిమాల్లో స్టార్‌డమ్ సంపాదించి బాలీవుడ్‌కి వచ్చినా తమిళ నటుడిగా నన్ను సౌత్ యాక్టర్ అని అంటారు.
సౌత్ ఇండియన్ యాక్టర్ అని కూడా కాదు.. మధ్యలో ఉన్న వాళ్లే.. ఈ నిబంధనలన్నింటినీ రూపొందిస్తున్నారు. ఉత్తమ సాంకేతిక నిపుణులు ఉత్తమ చిత్రాలను రూపొందిస్తారు. ఏ భాషలో తీయడానికి పిలిచినా వస్తారు. చెన్నైకి చెందిన గొప్ప టెక్నీషియన్లు హిందీ సినిమాలో పనిచేశారు. తెలుగు సినిమా గొప్ప నిర్మాతలు హిందీ చిత్రసీమలో పనిచేశారు.
నేటి 'కేజీఎఫ్'లోని గొప్ప కన్నడిగులు పనిచేసారు. ఏసినిమాకైనా కంటెంట్ బాగుంటే పేరు పెట్టాల్సిన అవసరం లేదు.. ఎక్కడికైనా వెళ్తుంది. ఎన్ని భాషల్లోనైనా ఆడుతుంది. ఆపాటికి దానికి పాన్ ఇండియా అని పేరు పెట్టి ఏదో చేస్తున్నట్లు బిల్డప్ అవసరం లేదు`` అన్నారు. ఇప్పుడు అన్ని సినీ పరిశ్రమలు ఎంతో ఉన్నతంగా ఎదిగాయి.