Begin typing your search above and press return to search.

సిద్ధార్థ్ పంచ్! రంగనా అతన్ని పికప్ చేయలేదా?

By:  Tupaki Desk   |   6 Jan 2022 5:30 PM GMT
సిద్ధార్థ్ పంచ్! రంగనా అతన్ని పికప్ చేయలేదా?
X
హీరో సిద్ధార్థ్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో రాజ‌కీయ నాయ‌కుల‌పై సూటిగా సెటైర్లు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో సినిమా టికెట్ రేట్ల‌పై ధైర్యంగా ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ప్ర‌య‌త్నం చేశాడు. దానికి ప‌రిశ్ర‌మ నుంచి గొప్ప స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ పై అత‌డు వేసిన పంచ్ హాట్ టాపిక్ గా మారింది. పంజాబ్ లో మోదీ ని రోడ్ పైనే రైతులు నిర్భంధించిన క్ర‌మంలో సెక్యూరిటీ స‌రిగా లేదంటూ సోష‌ల్ మీడియాల్లో డిబేట్ ర‌న్ అవుతోంది. అదే క్ర‌మంలో సిద్ధార్థ్ టైమింగ్ లీ ఈ ఘ‌ట‌న‌పై పంచ్ వేశారు.

ఇంత‌కీ సిద్దార్థ్ ఏమ‌ని పంచ్ వేశాడు? అంటే...``రంగనా అతనిని తన Z కారవాన్ తో పికప్ చేసుకోలేదా? వాట్సాప్ లో స్నేహితులుగా ఉన్నారని అనుకున్నా`` అంటూ హీరో సిద్ధార్థ్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసి నెటిజనుల్లో న‌వ్వులు పూయించాడు. సిధ్ వ్యంగ్యంగా స్పందించిన తీరుకు సోష‌ల్ మీడియా వ‌ర్గాల్లో గుస‌గుస‌లు అంతే వేగంగా స్ప్రెడ్ అయ్యాయి. మోదీని స‌మ‌ర్థిస్తున్న ప్ర‌ముఖ బాలీవుడ్ క‌థానాయిక పేరులో మొద‌టి అక్ష‌రం మార్పుతో సిద్ధార్థ్ పంచ్ వేసిన తీరు చ‌ర్చ‌కు వ‌చ్చింది. మోదీకి మ‌ద్ధ‌తిస్తున్న వివాదాస్ప‌ద క‌థానాయిక పేరును అత‌డు ప్ర‌స్థావిస్తూ వ్యంగ్యాస్త్రం విసిరాడు.

మోదీజీ భద్రతా ప్రోటోకాల్ లో తీవ్రమైన లోపాన్ని బహిర్గతం చేస్తూ రంగానా.. అని ప్ర‌స్థావించ‌డాన్ని యువ‌జనం సులువుగా గుర్తించారు.అయితే ఈ పెద్ద హీరోయిన్ `రంగన` ఎప్పుడూ అధికార పార్టీకి ఎలా అండగా నిలుస్తుందో ప్ర‌ధానికి అనుకూలంగా తన ఘాటు అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తుందో అందరికీ తెలిసిందే. రంగనా తన Z కారవాన్ తో మోదీజీని ఈ క్లిష్ట స‌మ‌యంలో పికప్ చేయలేకపోయారా? వాట్సాప్ లో స్నేహితులమే అనుకున్నాను!! అంటూ పంచ్ వేశాడు సిద్ధూ.

సిద్ధార్థ్ నుండి వ‌చ్చిన ఈ ట్వీట్ కొంత క్రూరంగా ఉంద‌ని ఒక నెటిజ‌న్ అభిప్రాయం వ్య‌క్తం చేయ‌గా.. కొంద‌రు సెటైర్ ని మెచ్చుకున్నారు. ఇక సిద్ధార్థ్ నుంచి వ‌చ్చిన ఇత‌ర ట్వీట్ ల‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మొత్తానికి నెటిజ‌నుల్లో సిద్ధార్థ్ కి క్రేజ్ పెరుగుతోంద‌నే చెప్పాలి. ఇక‌పోతే సిద్ధార్థ్ కెరీర్ ఇటీవ‌లి కాలంలో అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న మ‌హాస‌ముద్రం డిజాస్ట‌ర‌వ్వ‌డం అత‌డికి మ‌రోసారి మైన‌స్ గా మారింది.