Begin typing your search above and press return to search.
ప్రముఖ నటుడి మరణంలో అనుమానాలేవీ లేవ్
By: Tupaki Desk | 3 Sep 2021 1:30 PM GMTబాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. అతని అభిమానులు.. సన్నిహితులు.. కుటుంబం .. మొత్తం టీవీ పరిశ్రమ ప్రముఖులు.. బాలీవుడ్ సోదరులు అతని మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్లా గుండెపోటుకు గురయ్యారని ప్రాథమికంగా కథనాలొచ్చాయి. కానీ ఆ తరువాత మరణానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు వెల్లడించారు. దాంతో అనుమానాస్పదం అంటూ కొన్ని మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అప్పటి నుండి అందరూ పోస్ట్ మార్టం నివేదికల కోసం వేచి ఉన్నారు. ఎట్టకేలకు ఈ నివేదిక చివరకు బయటకు వచ్చింది.
పోస్ట్ మార్టం నివేదికల ప్రకారం.. డాక్టర్లు ఎటువంటి అభిప్రాయాన్ని వెలువరించలేదు. ఎందుకంటే వారు ఏదో జరిగింది అనడానికి ఎలాంటి ఆధారాన్ని కనుగొనలేదు. అయినప్పటికీ వారు మరింత విశ్లేషణ కోసం సిద్ధార్థ్ శుక్లా విసెరాను జాగ్రత్తగా భద్రపరిచారు. గుండెపోటుకు దారితీసిన మరణానికి అసలు కారణాన్ని వారు త్వరలో కనుగొంటారు. సెప్టెంబర్ 2న కూపర్ హాస్పిటల్ అతని మరణాన్ని ధృవీకరించింది. అతను నిద్రపోయే ముందు కొంత ఔషధం తీసుకున్నారని.. ఆ తర్వాత మేల్కొనలేదని ఆసుపత్రి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. శుక్లా అతని తల్లి ఇద్దరు సోదరీమణులు అక్కడ ఉన్నారు. కూపర్ హాస్పిటల్ సీనియర్ అధికారి ఆసుపత్రిలో సిద్ధార్థ్ శుక్లా చనిపోయిన విషయాన్ని నిన్నటి రోజున మీడియాకి వెల్లడించారు.
సిద్ధార్థ్ శుక్లా మృతదేహాన్ని ఓషివారా శ్మశానవాటికకు తరలించారు. ప్రముఖులు శ్మశానవాటికకు చేరుకున్న ఫోటోలు.. వీడియోలు బయటకు వచ్చాయి. సిద్ధార్థ్ శుక్లా స్నేహితురాలు షెహ్నాజ్ గిల్ కూడా తన సోదరుడితో అక్కడికి చేరుకుంది. ఆమె గుండెల్ని ద్రవింపజేసేంతగా కన్నీరుమున్నీరయ్యారు. పరిశ్రమ నుండి స్నేహితులు చాలా మంది శుక్లా నివాసానికి వెళ్లి కుటుంబీకుల్ని ఓదార్చారు. జాస్మిన్ భాసిన్- రషమీ దేశాయ్ నుండి అలీ గోని- వరుణ్ ధావన్ వరకు నిన్న రాత్రి అతని ఇంట్లో చాలా మంది కనిపించారు. సిద్ధార్థ్ శుక్లా కుటుంబానికి అవసరమైన బలాన్ని ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం అంటూ సహచరులు ప్రార్థించారు.