Begin typing your search above and press return to search.
నిర్మాతగా మారిన మరొ నటుడు
By: Tupaki Desk | 2 Sep 2015 11:40 AM GMTనటులు నిర్మాతలు గా మారడం కొత్తేమీ కాదు. కొద్దిమంది కథానాయకులు తమని తాము ప్రమోట్ చేసుకోవడానికి, వాళ్ల టేస్టుకి తగ్గట్టు గా వాళ్లు సినిమాలు చేసుకోవడాని కి సొంతంగా నిర్మాణ సంస్థలు ఏర్పాటు చేస్తుంటారు. అలా ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు కథానాయకులందరి కీ సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. పలు చిత్రాల్లో కథానాయకుడి గా, క్యారెక్టర్ ఆర్టిస్టు గా నటించి గుర్తింపు తెచ్చుకొన్న శివబాలాజీ కూడా ఇప్పుడో నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశాడు. మహేష్ ఉప్పుటూరి దర్శకత్వం లో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాడు. ఆ సినిమాలో అజయ్ తో శివబాలాజీ కూడా ఓ కీలక పాత్రని పోషిస్తున్నాడు. ‘ఇది అశోక్‌గాడి లవ్‌స్టోరీ’ సినిమాతో తెరంగేట్రం చేసి ఆర్య, సంక్రాంతి, పోతేపోనీ, శంభో శివ శంభో వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకొన్నాడు శివబాలాజీ. అయితే కొంతకాలం గా ఆయన కి చెప్పుకోదగ్గ సినిమాలు పడట్లేదు. తనకి తగ్గ కథ, పాత్రలు దొరికాయనో మరేంటో తెలియదు కానీ... ఉన్నట్టుండి నిర్మాత గా మారారు. గగన్ మ్యాజికల్ ఫ్రేమ్స్ అనే బ్యానర్ పై సినిమా చేస్తున్నాడు.
ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందనున్న శివబాలాజీ చిత్రం సెప్టెంబర్ 23న లాంఛనంగా ప్రారంభం కానుంది. నిజ జీవితంలో ఇద్దరు స్నేహితుల కి ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు సమాచారం. 1980 బ్యాక్ డ్రాప్‌లో సినిమా సాగుతుందట. మరి తన సొంత సంస్థలో రూపొందుతున్న సినిమాతో శివబాలాజీ నటుడి గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకొంటాడో చూడాలి. శివబాలాజీ మాత్రం కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో భాగంగానే సినిమా చేస్తున్నా అని చెబుతున్నాడు. కారణం ఏదైనా ఇలాంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని సాధిస్తే పరిశ్రమకి మేలే జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.