Begin typing your search above and press return to search.
కొడుకు చెత్త పనని వెనకేసుకు వస్తున్న నటుడు
By: Tupaki Desk | 5 March 2020 12:25 PM GMTతమిళ సినీ నటుడు.. ప్రస్తుతం అన్నా డీఎంకే పార్టీ అధికార ప్రతినిధి అయిన సూర్యకాంత్ తనయుడు విజయ్ హరీష్ పై అన్నా నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. విజయ్ హరీష్ కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి తనను రేప్ చేశాడు అంటూ ఒక అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏ క్షణంలో అయినా విజయ్ హరీష్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.
అన్నా డీఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉంది కనుక తన కొడుకును బయటకు లాగేందుకు సూర్యకాంత్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. హోం మంత్రి వద్దకు తన కొడుకు నిర్దోషి అంటూ సూర్యకాంత్ వెళ్లినట్లుగా చెబుతున్నారు. బాధితురాలు మాత్రం విజయ్ హరీష్ ను అరెస్ట్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. మీడియా ముందుకు ఈ విషయం రావడంతో రాజకీయాలు ఈ కేసులో పనిచేయక పోవచ్చు అంటున్నారు.
స్నేహితుడు అని నమ్మి ఒకానొక సమయంలో విజయ్ హరీష్ తో అపార్ట్ మెంట్ కు వెళ్తే అక్కడ మత్తు మందు ఇచ్చి నాపై అఘాయిత్యం చేశాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి నన్ను లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడంటూ వాపోయింది. జనవరి 2న తనపై అఘాయిత్యం జరిగింది అంటూ ఆమె చెబుతుంది.
మరో వైపు సూర్యకాంత్ మాత్రం తన కొడుకుపై ఆమె లేని పోని అబాండాలు వేస్తుంది. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని.. నా కొడుకును అడ్డు పెట్టుకుని నా రాజకీయ జీవితాన్ని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. నా కొడుకు అమాయకుడు అంటూ వెనకేసుకు వస్తున్నాడు. రేప్ చేసిన కొడుకును శిక్షించకుండా ఇలా నీచంగా వెనకేసుకు రావడం ఏంటీ అంటూ నెటిజన్స్ ఆయనపై మండి పడుతున్నారు.