Begin typing your search above and press return to search.
సూపర్ స్టార్ చాలా 'తేడా' అని అంటున్న సీనియర్ యాక్టర్
By: Tupaki Desk | 4 April 2023 11:27 AM GMTమలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చాలా 'తేడా' .. అతడు తెర ముందు ఒకలా తెర వెనుక ఒకలా ఉంటాడు అంటూ సీనియర్ నటుడు శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. జనాలు తనను మంచి వాడు అనుకోవాలని కొన్ని విషయాల్లో మీడియా ముందు ఒకలా.. తెర వెనుక మరో విధంగా మాట్లాడటం మోహన్ లాల్ కు మాత్రమే చెల్లింది అంటూ శ్రీనివాసన్ ఆరోపించాడు.
ప్రముఖ నటుడు ప్రేమ్ నజీర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను శ్రీనివాసన్ తో చేయాలని ఆశ పడ్డాడు. కానీ మోహన్ లాల్ ఆ ప్రాజెక్ట్ ను తిరష్కరించాడు. చాలా సార్లు ప్రయత్నించినా కూడా మోహన్ లాల్ మాత్రం తిరష్కరిస్తూనే వచ్చాడు. అయితే ప్రేమ్ నజీర్ చనిపోయిన తర్వాత మీడియా ముందుకు మోహన్ లాల్ వచ్చి మేము ఇద్దరం సినిమా చేయాలనుకున్నాం.. ఇంతలో ఇలా జరిగిందని నటించాడని శ్రీనివాసన్ ఆరోపించారు.
శ్రీనివాసన్ ఇంకా మాట్లాడుతూ... మోహన్ లాల్ తో సినిమాను చేసేందుకు ప్రేమ్ నజీర్ చాలా ప్రయత్నించారు. కడతనందన్ అంబాడీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమ్ నాతో ఆ విషయాన్ని చెప్పాడు. నేను మోహన్ లాల్ తో మాట్లాడుతాను నువ్వు ఒక మంచి కథను రెడీ చేసుకో అంటూ చెప్పాను. కొన్నాళ్లకు ప్రేమ్ కథను సిద్ధం చేశాడు. ఆ కథకు మోహన్ లాల్ నో చెప్పాడు. ఆసక్తి లేదంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు.
అదే కథను నడరాజన్ అనే మధ్యవర్తి ద్వారా మోహన్ లాల్ కు చెప్పించాను. ఆ సమయంలో నడరాజన్ ను మోహన్ లాల్ తిట్టేశాడు. సందేశం సినిమా కథను మళ్లీ నాకు చెప్పేందుకు వచ్చావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రేమ్ నుండి అడ్వాన్స్ తీసుకుని కూడా కథ నచ్చలేదు.. ఆసక్తి లేదు అంటూ మోహన్ లాల్ సినిమా చేయకుండా తప్పించుకున్నాడు అంటూ శ్రీనివాసన్ ఆరోపించారు.
ప్రేమ్ చనిపోయిన తర్వాత మాత్రం మీడియా ముందుకు వచ్చి నటించాడని.. మోహన్ లాల్ మొత్తం బండారం నేను చనిపోయే లోపు బయట పెడుతాను అన్నాడు. శ్రీనివాసన్ వ్యాఖ్యలు ప్రస్తుతం కేరళ సినీ వర్గాలతో పాటు మీడియా సర్కిల్స్ లో కూడా చర్చనీయాంశం అయింది.
ప్రేమ్ నజీర్ తనయుడు షానవాజ్ మాట్లాడుతూ.. తన తండ్రి గతంలో మోహన్ లాల్ తో ఒక సినిమాను చేయాలని ఆశ పడిన మాట వాస్తవం. కానీ కారణం ఏంటో కానీ ఇద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కలేదు. శ్రీనివాసన్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం ఉండి ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై మోహన్ లాల్ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.