Begin typing your search above and press return to search.
ముంబైలో ఇల్లు కొన్న సూర్య.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!
By: Tupaki Desk | 21 March 2023 8:00 AM GMTకోలీవుడ్ స్టార్ సూర్య కమర్షియల్ సినిమాలే కాదు ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ముందుంటారు. హీరోగానే కాకుండా నిర్మాతగా 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్య సినిమాలు చేస్తున్నారు. ఆయన నటించిన సూరరై పోట్రు సినిమాకు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. అయితే తను నిర్మించిన సినిమాలను హిందీలో రీమేక్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు సూర్య. అందుకు చెన్నై, ముంబై తరచు వెళ్లొస్తున్నారు.
ఇక చెన్నైలో ఎలాగు సొంత విల్లా ఉన్న సూర్య లేటెస్ట్ గా ముంబైలో కూడా సొంత ఇల్లు కొనేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సినీ ప్రముఖులు, పొలిటీషియన్స్ ఉండే రిచ్ ఏరియాలో 9000 చదరపు అడుగుల ప్లాట్ ను కొనేశారట సూర్య. 70 కోట్లు పెట్టి ఈ ప్లాట్ సొంతం చేసుకున్నారని తెలుస్తుంది. సూర్య అంత ఖర్చు పెట్టి ముంబైలో ఎందుకు ఇల్లు తీసుకున్నాడు అన్నది హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం సూర్య 41వ సినిమా సెట్స్ మీద ఉంది. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాపై సూర్య చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో సూర్య నటిస్తున్న కమర్షియల్ సినిమా ఇదే అని చెప్పొచ్చు.
తమిళ హీరోనే అయినా సూర్యకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. గజిని సినిమా టైం నుంచి సూర్య ప్రతి సినిమాకు తెలుగులో మంచి బిజినెస్ జరుగుతుంది. కొన్ని సినిమాలు తెలుగు ఆడియన్స్ ని అలరించక పోయినా సూర్య మాత్రం తన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయిస్తున్నారు. ఆయన నటించిన ఆకాశమే హద్దురా, జై భీం సినిమాలు తెలుగులో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.