Begin typing your search above and press return to search.

వైరల్‌ పిక్ : భారతరత్నను కలిసిన సూర్య

By:  Tupaki Desk   |   16 Feb 2023 6:17 PM GMT
వైరల్‌ పిక్ : భారతరత్నను కలిసిన సూర్య
X
తమిళ్‌ స్టార్‌ హీరో సూర్య తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఆ ఫొటోలో భారతరత్న సచిన్ టెండూల్కర్ తో సూర్య ఉన్నాడు. గౌరవం మరియు ప్రేమ అంటూ ఈ ఫొటోకు సూర్య కామెంట్‌ పెట్టాడు.

టెండూల్కర్ మరియు సూర్య ఏ సందర్భంగా కలిశారు.. ఎందుకు కలిశారు అనేది క్లారిటీ లేదు కానీ ఇద్దరు ప్రముఖులు కలవడంతో సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హిందీలో సూర్య 'సూరరై పొట్రు' సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.

ఆ సినిమా లో సూర్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాకు సంబంధించి సచిన్‌ ను సూర్య కలిశాడా అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి సూర్య మరియు సచిన్ టెండూల్కర్ యొక్క ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదే ఫొటోను సచిన్ కూడా షేర్ చేయడంతో పాటు తమిళంలో కామెంట్ ను జోడించాడు.

సూరరై పొట్రు సినిమా తెలుగు లో ఆకాశమే నీ హద్దు గా డబ్ అయిన విషయం తెల్సిందే. తమిళం మరియు తెలుగు లో భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. అక్షయ్ కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తుండగా భూమి పడ్నేకర్‌ హీరోయిన్ గా నటిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.