Begin typing your search above and press return to search.

రిల్ స్టార్‌ : సెల్ఫీ అడిగిన లేడీ ఫ్యాన్‌ కు ఏకంగా...!

By:  Tupaki Desk   |   15 April 2023 9:39 AM
రిల్ స్టార్‌ : సెల్ఫీ అడిగిన లేడీ ఫ్యాన్‌ కు ఏకంగా...!
X
తమిళ స్టార్‌ అజిత్ కుమార్ గురించి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మీడియా వారు కూడా రెగ్యులర్ గా మాట్లాడుకుంటూనే ఉంటారు. అజిత్ సింప్లిసిటీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన ఒక సూపర్ స్టార్‌ అయ్యి ఉండి కూడా సాధారణ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్ లో నిలబడ్డా.. రోడ్డు మీద బండి పై టిఫిన్ చేసినా అది అజిత్ కే చెల్లుతుంది.

ఒక స్టార్.. సూపర్ స్టార్‌ అనే ప్రవర్తన ఆయన ఎప్పుడు కూడా కనబర్చడు. బైక్ పై వందల కిలో మీటర్లు ప్రయాణిస్తూ రోడ్డు పక్కన ఉన్న వారితో మాట్లాడుతూ కాలక్షేపం చేసే సూపర్‌ స్టార్ అజిత్ మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఎయిర్ పోర్ట్‌ లో పది నెలల పిల్లాడిని మోస్తూ రెండు బ్యాగ్‌ లను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళకు అజిత్ చేసిన సాయం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పది నెలల బిడ్డను ఎత్తుకుని ఒక మహిళ గ్లాస్గో నుంచి చెన్నై ప్రయాణించింది. ఆ సమయంలో ఆమెకు అజిత్ కనిపించడంతో అభిమానంతో దగ్గరకు వెళ్లి ఒక ఫోటో అడిగింది. అందుకు అజిత్ ఓకే చెప్పాడు. అప్పుడే బిడ్డను ఎత్తుకుని రెండు బ్యాగ్స్ ను పట్టుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఆ మహిళకు అజిత్ సహాయం చేశాడు.

ఒక బ్యాగ్‌ ను తీసుకుని ఆమె విమానం ఎక్కే వరకు పట్టుకునే ఉన్నాడు. వద్దు అంటూ ఎంత వారించినా కూడా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఏం పర్లేదు నేను సహాయం చేస్తాను అన్నాడట. ఆ సమయంలో ఆయన వద్ద కూడా ఒక పెద్ద బ్యాగ్‌ ఉంది. తన బ్యాగ్‌ ను పట్టుకోవడంతో పాటు ఆ మహిళ బ్యాగ్ ను కూడా అజిత్ పట్టుకున్నాడట.

అజిత్ పక్కన ఉన్న వ్యక్తి తాను పట్టుకుంటాను అన్నా కూడా ఒప్పుకోలేదట. ఆ మహిళ విమానం ఎక్కే వరకు కూడా ఒక బ్యాగ్‌ ను పట్టుకుని క్యాబిన్‌ క్రూ కు అప్పగించాడట. నిజంగా అజిత్ గొప్ప వ్యక్తి అంటూ ఈ సంఘటనతో నిరూపితం అయ్యింది. ఈ విషయాన్ని సదరు మహిళ యొక్క భర్త అయిన కార్తీక్ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు.

తన భార్య సెల్ఫీ అడిగితే అజిత్ ఏకంగా బ్యాగ్‌ పట్టుకుని విమానం ఎక్కే వరకు హెల్ఫ గా ఉన్న విషయాన్ని కార్తీక్ షేర్ చేయడంతో అంతా కూడా మరోసారి తమ అభిమాన హీరో ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం కార్తీక్ షేర్‌ చేసిన పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.