Begin typing your search above and press return to search.

ఎవ‌రు ఆపుతారో ఇప్పుడు ర‌మ్మ‌నండి!

By:  Tupaki Desk   |   27 Aug 2022 11:30 AM GMT
ఎవ‌రు ఆపుతారో ఇప్పుడు ర‌మ్మ‌నండి!
X
యంగ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్ న‌టించిన లేటెస్ట్ సూప‌ర్ నేచుర‌ల్ మిస్టిక్ థ్రిల్ల‌ర్ 'కార్తికేయ 2'. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ల‌పై అభిషేక్ అగ‌ర్వాల్‌, టి.జి. విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ ఆగ‌స్టు 13న భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో విడుద‌లై సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన తెలుగు సినిమాల్లో బాహుబ‌లి, పుష్ప‌, RRR సినిమాలు ద‌క్షిణాదితో పాటు ఉత్త‌రాదిలోనూ సంచ‌లనాలు సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు 'కార్తికేయ‌2' కు కూడా అదే స్థాయిలో ఆద‌ర‌ణ లభిస్తుండ‌టం విశేషం. ఉత్త‌రాదిలో చాలా త‌క్కువ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ కేవ‌లం మౌత్ టాక్ తో ఇప్ప‌డు ఏకంగా 1000 థియేట‌ర్ల‌కు మించి ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

కృష్ణ త‌త్వాన్ని ప్ర‌బోధించే క‌థాంశంతో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో ఈ చిత్రానికి ఉత్త‌రాది ప్రేక్ష‌కులు కూడా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సినిమా రెండు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డి చివ‌రికి ఆగ‌స్టు 13న విడుద‌లైంది. ప్ర‌స్తుతం ఊహించ‌ని స్థాయిలో రూ. 100 కోట్ల క్ల‌బ్ లో చేరింది. హిందీ బెల్ట్ లో ఈ మూవీ సాధిస్తున్న వ‌సూళ్ల‌ని చూసి బాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు ట్రేడ్ పండితులు విస్తూ పోతున్నారు. ఒక చిన్న హీరో సినిమా ఈ స్థాయిలో నార్త్ లో వ‌సూళ్ల సునామీని సృష్టించ‌డం ఇదే ప్ర‌ధ‌మం కావ‌డంతో నిఖిల్ పేరు ప్ర‌స్తుతం దేశ మంత‌టా మారుమోగుతోంది.

ఈ నేప‌థ్యంలో క‌ర్నూల్ లో చిత్ర బృందం గ్రాండ్ స‌క్సెస్ ఈవెంట్ ని నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా న‌టి తుల‌సి మాట్లాడుతూ ఎమోష‌న‌ల్ అయింది. ఒక త‌ల్లి మాత్ర‌మే ఇంత‌టి ఆప్యాయ‌త‌ను సంపాదించుకోగ‌ల‌దేమో. దేశం మొత్తం చందూ మొండేటి గురించి మాట్లాడుకుంటోంది. చిన్న సినిమాగా విడుద‌లైన 'కార్తికేయ 2' గురించి మాట్లాడుకుంటోంది. ఆస్ట్రేలియా నుంచి నాకు ఒక కాల్ వ‌చ్చింది. చందూ మొండేటి డైరెక్ట‌రా? లేక లెక్చ‌ర‌రా? అని అడిగారు. ఏమో నాకూ తెలియ‌దు అడిగి తెలుసుకుంటాను అని అన్నాను.

అంటే చందూ మొండేటి ఈ మూవీని అంత డీటైలింగ్ అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా తీశారు. భాష‌లు ఎలా వున్నాయో.. మా సినిమా కూడా అంతే. అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డ‌మే 'కార్తికేయ 2' చిత్రం. త‌ల్లిని ఎంత ప్రేమ‌గా చూసుకోవాలో చూపించాడు. కృష్ణుడు కూడా ఓ మ‌నిషే.. త‌ల్లిని ప్రేమించేవాడు. త‌రువాత అన్నీ నేర్చుకున్నాడు. జ‌నాల‌కు వ‌దిలేశాడు. మీరంతా కేడా కృష్ణుడిలానే క‌నిపిస్తున్నారు. మీకు ఆభ‌ర‌ణాలు, కిరీటాలు అవ‌స‌రం లేదు. జ‌స్ట్ మంచిగా ఉంటూ ఫోక‌స్ట్ గా ఉండాలంతే. అప్పుడు మీరు కూడా కార్తికేయ‌లు అవుతార‌న్న‌దే ఈ చిత్రం.

ఈ సినిమాకు ఇద్ద‌రు తండ్రులు. నిర్మాత‌లు అభిషేక్ అగ‌ర్వాల్‌, విశ్వ‌ప్ర‌సాద్. తండ్రి పేరంటే అంద‌రూ వెతుకుతారు ఇప్ప‌డు అలా అయింది. అంద‌రూ ఇది చిన్న చిత్ర‌మ‌ని అనుకున్నారు. మ‌మ్మ‌ల్ని మ‌రీ అంత చిన్న‌వాళ్ల‌మ‌ని అంచ‌నా వేయ‌కండి.. చిట్టి ఎలుకే కదా? అని అనుకుంటే ... అది రంధ్రం చేస్తుంది. అలా మా లిటిల్ బాయ్ కార్తికేయ.. మేం చిన్న‌వాళ్ల‌మే కావ‌చ్చు.. కానీ ప్ర‌పంచం మాత్రం మ‌మ్మ‌ల్ని ఎంతో ఎత్తులో నిల‌బెట్టింది. మీ ప్రేమ‌, ఆప్యాయ‌త‌లే కార్తికేయ 2. వంద కోట్ల డ‌బ్బు కాదు. మీ ప్రేమ దొర‌క‌డం ముఖ్యం.. ఎవ‌రు ఆపుతారో ఇప్పుడు ర‌మ్మ‌నండి!.. చూసుకుందాం.. అంటూ న‌టి తుల‌సి ఎమోష‌న‌ల్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.