Begin typing your search above and press return to search.
ఉత్తేజ్ కూతురు చిచ్చరపిడుగురో!
By: Tupaki Desk | 21 Aug 2018 5:53 PM GMTఓయ్ రంగమ్మా మంగమ్మా.
ఓయ్ రంగమ్మా మంగమ్మా రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడూ..
పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు!
గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే..!!
ఈ పాటను ఏ మెగాభిమాని అంత తేలిగ్గా మర్చిపోలేడు. రంగస్థలం రిలీజై ఇంతకాలమైనా ఇంకా ఊరూ వాడా - పల్లె పట్నం అనే తేడా లేకుండా ఫ్యాన్స్ వీలున్నప్పుడల్లా హమ్ చేస్తూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో అంతగా ప్రభావితం చేసి - శ్రోతల్ని మెప్పించిన వేరొక బ్లాక్ బస్టర్ సాంగ్ లేనేలేదంటే అతిశయోక్తి కాదు. ఏ పాట అయితే జనం నాలుకపై - నోళ్లలో నానుతుందో ఆ పాటనే గొప్ప పాట అంటారు. రంగమ్మా మంగమ్మా సాంగ్ ఆ కేటగిరీకే చెందుతుంది.
ఈ పాపులర్ సాంగ్ ని నేటి సాయంత్రం మెగాస్టార్ బర్త్ డే (63వ బర్త్ డే) వేడుకల్లో శిల్పకళా వేదిక సాక్షిగా పేరడీ చేసిన తీరు ఆకట్టుకుంది. ఈ పాటలో పూర్తిగా మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ ప్రతిభాపాఠవం గురించి గొప్పగా పాడి వినిపించింది ఆ చిన్నారి. పేరడీ పాడిన ఆ చిచ్చరపిడుగు అదిరిపోయే డ్యాన్సులతోనూ - మెగాస్టార్ డైలాగ్స్‌తోనూ అహూతుల్ని రంజింపజేసింది. దేవీశ్రీ ప్రసాద్ తర్వాత మళ్లీ వేదికపై ఆడుతూ పాడుతూ ట్యాలెంట్ చూపించిన ఏకైక ప్రతిభావనిలా ఆ క్షణం అందరికీ కనిపించింది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరు? అంటే ఉత్తేజ్ డాటర్ అని తెలిసి అంతా షాకయ్యారు. ఉత్తేజ్ పెద్ద కూతురు చేతన ఇదివరకూ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ రెండో డాటర్ గురించి జనాలకు తెలిసింది తక్కువే. అయితే తను రంగస్థలం సెట్స్ లో నాకు పరిచయమైంది అంటూ రామ్ చరణ్ వేదిక వద్ద తెలిపారు. ఆ పాట పాడిన తనని హత్తుకుని అభినందించారు. స్పాట్ లో ఉన్న బన్ని - వరుణ్ తేజ్ సదరు చిచ్చరపిడుగును పొగిడేయడం విశేషం. స్వతహాగా రచయిత అయిన ఉత్తేజ్ ఈ పాటను రాసి ట్యూన్ కట్టించి ఉంటాడు. దానిని కుమార్తె అద్భుతంగా అభినయించింది.