Begin typing your search above and press return to search.
SPB అంత్యక్రియల్లో దళపతి విజయ్.. తళా అజిత్ రాలేదేం?
By: Tupaki Desk | 29 Sep 2020 5:00 AM GMTగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు దళపతి విజయ్ హాజరు కావడం చాలా మంది హృదయాలను గెలుచుకుంది. కానీ చాలా మంది ఇతర హీరోలు స్టార్లు హాజరు కాలేకపోవడంపై నెటిజనుల్లో రకరకాల చర్చ సాగుతోంది. ముఖ్యంగా తళా అజిత్ ఈ అంతిమ సంస్కారాల్లో పాల్గొనకపోవడంపై ఒక సెక్షన్ లో తీవ్ర విమర్శలే వెల్లువెత్తాయి.
అయితే అజిత్ ఎందుకని రాలేదు? అన్న ప్రశ్నకు ఎస్పీబీ వారసుడు చరణ్ సమాధానమిచ్చారు. ``ఇలాంటి వ్యాఖ్యలకు నేను ఎందుకు స్పందించాలి? అజిత్ నా స్నేహితుడు. అతను నాన్నతో కూడా స్నేహంగా ఉన్నాడు. అజిత్ దుఃఖిస్తుండొచ్చు. అతను ఇంట్లో ఉండి దుఃఖిస్తూ ఉంటాడు. అతను వ్యక్తిగతంగా వచ్చినా లేదా రాకపోయినా .. నాతో మాట్లాడినా లేకున్నా ఎలా ఉంటాడో నాకు తెలుసు. అంత్యక్రియలకు ఆయన హాజరుకాకపోతే దానిని సమస్యగా ఎందుకు మార్చాలనుకుంటున్నారు?`` అని చాలా సంగతుల్ని విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారు ఎస్పీ చరణ్.
``ప్రస్తుతానికి ఇవేవీ కూడా సమస్య కాదు. నేను నాన్నను కోల్పోయాను. ప్రపంచం ఎస్పీని కోల్పోయింది. మనమందరం దుఃఖం నుంచి తిరిగి కోలుకోడానికి కొంత సమయం కావాలి. దయచేసి దీన్ని మాకు అనుమతించండి`` అంటూ ఆవేదన చెందారు.
ఇలయదళపతి విజయ్ అభిమానులకు తళా అజిత్ అభిమానులకు మధ్య ఉన్న వైరం గురించి తెలిసిందే. ఆ క్రమంలోనే సోషల్ మీడియాల్లో ఈ తరహా పోస్టింగులు కలకలం రేపాయా? అన్నదానికి తమిళ మీడియా కథనాలు వండి వారుస్తుండడం విశేషం.