Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ పై పంచ్ వేసిన విజయ్
By: Tupaki Desk | 10 Aug 2017 10:41 AM GMTస్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం - మన ఆర్టీసీ బస్సుల్లో కనిపించే ఈ నినాదాన్ని తమిళ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ తన అభిమానులకు గుర్తు చేస్తున్నాడు. విజయ్ ను అవమానించేలా ట్వీట్ చేసిందనన్న కోపంతో చెన్నైకు చెందిన ఓ లేడీ జర్నలిస్టులపై అతడి అభిమానులు తిట్ల దండకం అందుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ మహిళలను కించపరిచేలా కామెంట్స్ చేయొద్దంటూ తన ఫ్యాన్స్ కు ఈ రిక్వెస్ట్ చేశాడు.
బాలివుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ ఫిలి జబ్ హ్యారీ మెట్ సెజల్ ప్రేక్షకులను బెంబేలెత్తిస్తోంది. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పరమ చెత్తగా ఉందనే టాక్ మూటగట్టుకుంది. చెన్నైకు చెందిన లేడీ జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ ఈ సినిమాకు వెళ్లి చూడలేక సగంలోనే వచ్చేసింది. కొన్నేళ్ల క్రితం విజయ్ హీరోగా నటించిన సుర సినిమాతో దీనిని పోలుస్తూ పోస్టు పెట్టింది. దీంతో విజయ్ అభిమానులకు విపరీతమైన కోపం వచ్చింది. సోషల్ మీడియాలో ఆమెను వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం మొదలెట్టారు. దీనిపై హర్టయిన ధన్య రాజేంద్రన్ పోలీసులకు కంప్లయిట్ చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆన్ లైన్ వేధింపులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ విషయం తెలిసిన విజయ్ అభిమానులను ఉద్దేశించి ఓ స్టేట్ మెంట్ విడుదల చేశాడు. ‘‘ఈ సొసైటీలో అందరికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. అంతమాత్రాల మహిళల పట్ల అసఖ్యంగా వ్యాఖ్యలు చేయడం.. వారిని కించపరిచే కామెంట్స్ చేయడం సరికాదు. నేను మహిళలను గౌరవిస్తాను’’ అంటూ తన స్టేట్ మెంట్ లో చెప్పుకొచ్చాడు. లేడీ జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్ ను ఇబ్బంది పెట్టేలా ఎలాంటి పనులూ చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు.