Begin typing your search above and press return to search.
విజయ్ లైట్ తీసుకుంటున్నాడా..? అశ్రద్ద చేస్తున్నాడా..?
By: Tupaki Desk | 5 April 2022 1:30 AM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే వారం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళంలో రూపొందిన ఈ సినిమాను పలు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తామంటూ చిత్ర యూనిట్ సభ్యులు గొప్పగా చెబుతున్నారు. అయితే తమిళనాడు బయట మాత్రం పబ్లిసిటీని తుతు మంత్రంగా కానిచ్చేస్తున్నారు.
విజయ్ హీరోగా నటించిన గత చిత్రాల్లో కొన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో విడుదల అయిన విజయ్ సినిమా లు తమిళంతో పాటు తెలుగు లో కూడా ఒక సారి విడుదల అయ్యాయి. అయితే వాటిలో కొన్ని తమిళనాట వందల కోట్ల వసూళ్లు దక్కించుకున్నాయి కాని తెలుగు లో మాత్రం కనీసం 10 కోట్ల వసూళ్లకు కిందా మీద పడి మరీ కష్టపడాల్సి వచ్చింది.
తెలుగు ఈయన కాస్త శ్రద్ద పెడితే ఖచ్చితంగా మంచి బడ్జెట్ క్రియేట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. కాని ఆయన మాత్రం అశ్రద్ద వల్లనా లేదంటే లైట్ తీసుకుంటున్నాడో అర్థం కావడం లేదు కాని తెలుగు రాష్ట్రాల మార్కెట్ పై ఆసక్తిగా లేడేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన హీరోగా ప్రస్తుతం రెడీ అవుతున్న బీస్ట్ సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
తమిళనాట ఖచ్చితంగా 250 కోట్ల వసూళ్లను బీస్ట్ దక్కించుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షన్ కనీసం 15 కోట్లు వసూళ్లు చేస్తే గొప్ప విషయం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. తెలుగు లో బీస్ట్ కు మంచి క్రేజ్ ఉంది. పలు కారణాల వల్ల బీస్ట్ సినిమాను చూడాలని తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తుతోంది.
ఆ ఆసక్తిని విజయ్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు క్యాష్ చేసుకోవాలంటే విజయ్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. తమిళనాట మాదిరిగా కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కేవలం తెలుగు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చాలు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చి బీస్ట్ సినిమా ప్రమోషన్ చేస్తే వేరే లెవల్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
విజయ్ లైట్ తీసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. ఆయన తమిళనాట వచ్చే వసూళ్ల తో సంతృప్తిగా ఉన్నారని.. ఆయన అందుకే తెలుగు బిజినెస్ పై ఆసక్తి చూపడేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు మాత్రం విజయ్ అశ్రద్ద కారణంగానే మంచి సినిమాలు నిరాశ పర్చుతున్నాయని.. తెలుగు లో ఎంత చిన్న మొత్తం కు తీసుకున్నా కూడా వసూళ్ల రాకపోవడంకు కారణం విజయ్ ప్రమోషన్స్ కు రాకపోవడం అనేది టాక్. విజయ్ ఈసారి అయినా బీస్ట్ కోసం తెలుగు మీడియా ముందుకు వస్తాడో చూడాలి.