Begin typing your search above and press return to search.
నాకూ విశ్వక్ కు రిలీఫ్ అంటే మ్యాన్షన్ హౌసే: బాలయ్య
By: Tupaki Desk | 23 Oct 2022 1:30 AM GMTబాక్సాఫీస్ బొనాంజా నందమూరి బాలకృష్ణ ఓటీటీలో అదరగొడుతున్నాడు. 'అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' టాక్ షో కోసం తొలిసారిగా వ్యాఖ్యాతగా మారిన బాలయ్య.. తనదైన శైలిలో అలరిస్తున్నారు. వెండితెర మీద డైలాగ్స్ తో రెచ్చిపోయే నటసింహం.. సెలబ్రిటీలతో కలిసి సందడి చేసే విధానం అందరినీ ఆకట్టుకుంది. ఈ క్రమంలో తనపై తాను జోక్స్ వేసుకోడానికి కూడా సీనియర్ హీరో వెనకాడలేదు. అందుకే ఈ షో మొదటి సీజన్ సూపర్ సక్సెస్ అయింది.
ఈ నేపథ్యంలో ఇటీవలే ''అన్ స్టాపబుల్'' సీజన్-2 తో గ్రాండ్ గా తిరిగొచ్చారు బాలయ్య. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ సరికొత్తగా ముస్తాబై వచ్చారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. దీనికి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ క్రమంలో రెండో ఎపిసోడ్ లో టాలీవుడ్ యంగ్ హీరోలు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరియు 'డీజే టిల్లు' సిద్ధు జొన్నలగడ్డ పాల్గొన్నారు.
ఇండస్ట్రీలో మంచి స్నేహాన్ని కలిగిఉన్న విశ్వక్ - సిద్ధు ఇద్దరూ ఈ ఎపిసోడ్ లో బాలయ్య తో కలిసి సందడి చేసారు. సినిమాలతో పాటుగా పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. బ్రేకప్ లు - రొమాంటిక్ సీన్ల గురించి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ బ్రాండ్ గా పేరుబడిన మాన్షన్ హౌస్ గురించి చెప్పడానికి కూడా నటసింహం వెనకాడలేదు.
చిట్ చాట్ లో భాగంగా సిద్దు జొన్నలగడ్డ - డైరెక్టర్ రవికాంత్ ఇద్దరూ లిప్ లాక్ ఇచ్చుకున్న ఓ ఫోటోని చూపించిన బాలయ్య.. ఇదేంటని ప్రశ్నించారు. దీనికి 'రిలీఫ్' అనే క్యాప్షన్ పెడతానని సిద్దు పేర్కొన్నారు. 'కృష్ణ అండ్ హిస్ లీల' సినిమా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని బయటకు వచ్చిన నేపథ్యంలో.. మూడేళ్ళ కష్టానికి ఆ కిస్ మాకు రిలీఫ్ అని తెలిపాడు.
దీనికి బాలయ్య స్పందిస్తూ..'నాకూ విశ్వక్ కు రిలీఫ్ అంటే మ్యాన్షన్ హౌస్.. నీకు ముద్దు' అని సరదాగా వ్యాఖ్యానించారు. అలానే 'మీ ఇద్దరు సాయంత్రం వెళ్లేప్పుడు మార్గ మధ్యలో మేన్షన్ హౌస్ కొనుక్కొని ఎవరు బెటర్ హీరో అనేది ఫిక్స్ అయిపోండి.. రేపు పొద్దున్న నాకు ఎస్ఎమ్ఎస్ చేయండి' మరో సందర్భంలో అన్నారు బాలకృష్ణ. గత సీజన్ లో నాని ఎపిసోడ్ లోనూ సీనియర్ హీరో తన బ్రాండ్ గురించి ప్రస్తావించారు.
ఇక తన సినిమాలలో సమర సింహారెడ్డి - నరసింహా నాయుడు సినిమాలు చేస్తారా అని బాలకృష్ణ అడగ్గా.. నరసింహా నాయుడు నేను చేస్తా అని సిద్ధు జొన్నలగడ్డ చెప్పాడు. భవిష్యత్ లో సినిమాలు చేయొద్దు అనుకున్నప్పుడు మీ సినిమాలు చేస్తాం సార్.. ఎందుకంటే మీ ఫ్యాన్స్ వచ్చి కొడతారని విశ్వక్ సేన్ నవ్వులు పూయించారు.
బ్రేకప్స్ గురించి టాపిక్ రాగా.. సినిమాకో గర్ల్ ఫ్రెండ్ ని మార్చేశావ్ అని సిద్దు ను ఉద్దేశించి బాలకృష్ణ అన్నారు. దీనికి 'సినిమాకో గర్ల్ ఫ్రెండ్ కాదు సార్.. కానీ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు, డిఫరెంట్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి ప్రభావం సినమాపై పడుతుంది కదా సార్. ఇక నేనే రాసుకునే వాన్ని కాబట్టి.. నా జీవితంలో జరిగినవే రాసేవాన్ని' అని సిద్ధు వివరణ ఇచ్చాడు. దీంతో 'అరే.. రాస్కోరా మార్కస్' అని బాలయ్య 'డీజే టిల్లు' డైలాగ్ చెప్పి నవ్వించారు.